గ్రామ సచివాలయ భవనాలకు రంగులు మార్చాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. రంగులు మార్చాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకొంటారా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
ఇవీ చదవండి: ఇంటి నుంచి బయటకు వస్తే ఇక అంతే