తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ రిలీవ్ చేసిన 584 మందికి తెలంగాణ విద్యుత్ సంస్థలే జీతాలివ్వాలని కోర్టు ఆదేశించింది. కేటాయింపులపై అభ్యంతరాలుంటే ధర్మాధికారి కమిటీ వద్దే తేల్చుకోవాలని కోర్టు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషన్ మెరిట్స్ జోలికి వెళ్లలేమన్న కోర్టు... ఇటీవల ఏపీ రిలీవ్ చేసిన 584 మందికి జీతాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ తెలంగాణ జెన్‌కో పిటిషన్ దాఖలుచేసింది.
ఇదీ చదవండి : కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష