ETV Bharat / city

పోలవరం నిర్మాణంపై.. ఎన్జీటీ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ - పోలవరం ప్రాజెక్టు వార్తలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో మరోసారి విచారణ జరిగింది. ఎన్జీటీ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.

Supreme Court
సుప్రీంకోర్టు
author img

By

Published : Jul 8, 2021, 7:46 PM IST

Updated : Jul 9, 2021, 6:44 AM IST

‘పోలవరం ముంపు అంశంలో మీ పిటిషన్‌పై స్టే ఇవ్వం... మీ వాదన వినడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఒడిశాకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ అంశంపై సంయుక్త నిపుణుల కమిటీని ఎన్జీటీ నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా పోలవరం ముంపు, భద్రాచలం పట్టణ ముంపు, నిర్వాసితులు, పునరావాసం అంశాలపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలతో కేంద్ర జలసంఘం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్‌ (జీడబ్ల్యూడీటీ) సమావేశమై సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం పిటిషన్‌ను విచారించింది. ఒడిశా తరపున న్యాయవాది పవన్‌భూషణ్‌ వాదనలు వినిపించారు. తమ రాష్ట్రం తరఫున వాదనలు వినిపించే సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణియం వేరే ధర్మాసనంలో వాదనలు వినిపిస్తున్నందున కేసును నాలుగు వారాలు వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. విచారణ నిలిపివేయాలని కోరుతూ స్టే పిటిషన్‌ వేశామని, ఈ అంశం సుప్రీంకోర్టు ముందున్నప్పుడు ఎన్జీటీకి విచారించే అధికారం లేదని పవన్‌ భూషణ్‌ ధర్మాసనానికి విన్నవించారు. ‘మేం స్టే ఇవ్వాలనుకోవడం లేదు. ఒడిశా వాదనలు వినేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదిగా ఉన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది అనితా షెనోయ్‌ జోక్యం చేసుకుంటూ స్టే ఇవ్వకుండా ఉంటే తమ స్పందన తెలియజేస్తామని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తాము స్టే ఇవ్వబోమని ధర్మాసనం మరోసారి పేర్కొంది. ఎన్జీటీ తమ వాదనలు వినలేదని, ముంపు సమస్యపై కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆదేశాలు జారీచేసిందని ఒడిశా తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుపై తమ రాష్ట్ర అభ్యంతరాలతో 2007లో వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందని ధర్మాసనానికి పవన్‌ భూషణ్‌ విన్నవించారు. తనకు ఆ విషయం తెలుసని, అది ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిందని జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. ఈ దశలో పొంగులేటి తరఫు సీనియర్‌ న్యాయవాది అనిత షెనోయ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ స్టే ఇవ్వవద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మేం స్టే ఇవ్వబోమని చెబుతున్నా... మీరు అదే అడుగుతున్నారు. మీరు కావాలంటే స్టే ఇస్తామంటూ ధర్మాసనం సరదాగా వ్యాఖ్యానించింది. అనంతరం కేసులో ప్రతివాదులుగా ఉన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ప్రస్తుత పిటిషన్‌ను ఒడిశా గతంలో దాఖలుచేసిన పిటిషన్‌కు జతచేసింది.

ఇదీ చదవండి:

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

Last Updated : Jul 9, 2021, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.