ETV Bharat / city

SSC Exams : కష్టపడితే ఫలితం.. 'పది'లమే - ఏపీ వార్తలు

‘అమ్మో.. పరీక్షలు వచ్చేస్తున్నాయి. ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదు. ‘లెక్కలంటే చాలా భయమేస్తోంది. సైన్స్‌లోనూ చాలా అనుమానాలున్నాయి!’. ప్రస్తుతం ఇది పదో తరగతి విద్యార్థిని ఆందోళన. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ.. రకరకాల సమస్యలతో భయాందోళనకు గురైతున్నారు. ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులకు నిపుణులు పలు సూచనలు చేశారు.

ssc exams
ssc exams
author img

By

Published : Apr 18, 2022, 5:24 AM IST

రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత మరో వారం రోజుల్లో పదోతరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. కరోనా నేపథ్యంలో వీరు 8, 9 తరగతుల్లోనూ పరీక్షలు రాయలేదు. 9లో ఎక్కువగా ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగాయి. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు లేని పేద పిల్లలకు బోధన సరిగా అందలేదు. సుమారు రెండు విద్యా సంవత్సరాలు అభ్యాసనను నష్టపోయిన ఈ విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షల సందర్భంగా కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. ఆన్‌లైన్‌ చదువుల నేపథ్యంలో పిల్లలు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు అలవాటుపడ్డారు. నోటు పుస్తకాలు రాయడంలో అంతరాయం ఏర్పడింది. దీంతో అందంగానూ, వేగంగానూ రాయడంలో చాలామంది తడబడుతున్నారు. చదివినది జ్ఞాపకం ఉండట్లేదని కొందరు పిల్లలు చెబుతున్నారు. మరోపక్క కరోనాకు ముందుతో పోల్చితే పదో తరగతి పరీక్షల్లో పాఠశాల విద్యాశాఖ భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులకు అనుగుణంగా, లోపాలను సవరించుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావడం ఇప్పుడు పిల్లల ముందున్న లక్ష్యం. గతంలో హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉండడం వల్ల ఒకరోజు బాగా రాయకపోయినా రెండో పేపర్‌ బాగా రాస్తే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉన్నందున ఒకేసారి అన్నింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

...

విద్యార్థుల్లో ఉపాధ్యాయలు గుర్తించిన సమస్యలు

* చేతిరాత వేగంగా రాయలేకపోవడం

* రెండు, మూడు గంటలపాటు ఒకచోట స్థిమితంగా కూర్చోలేకపోవడం

* ఇంటికి వెళ్లిన తర్వాత కొందరు సెల్‌ఫోన్లు వినియోగించడం

* గణితంలో ఒక లెక్క చెప్పి అదేమాదిరిగా మరొకటి ఇస్తే తడబడటం

* ఏకాగ్రత లోపించడం. ఇతర అంశాలపైకి ధ్యాస పోవడం

* కరోనాతో పాఠాలు సరిగా జరగనందున ప్రాథమిక భావనలు మర్చిపోవడం

* చదివిన విషయాలను జ్ఞాపకం ఉండకపోవడం

* వంద మార్కులకు జరిగే పరీక్షలు కావడంతో కొంత భయాందోళనలు

పరీక్షలో మార్పులు ఇలా..

* ఈ ఒక్క ఏడాదికీ 11 పేపర్లకు బదులు ఏడు ఉంటాయి. భౌతిక, రసాయనశాస్త్రం కలిపి 50 మార్కులు, జీవశాస్త్రం 50 మార్కులకు ఉంటుంది. మిగతా ఐదు సబ్జెక్టుల్లో వంద మార్కుల ప్రశ్నపత్రాలు ఉంటాయి.

* మొత్తం 33 ప్రశ్నలు ఇస్తారు. వంద మార్కుల పేపర్‌లో ప్రశ్నల సంఖ్యను పెంచకుండా వాటికి ఇచ్చే మార్కులను పెంచారు.

* ప్రత్యేకంగా బిట్‌ పేపర్‌ ఉండదు. బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపర్చడం, ఒకపదంలో సమాధానం రాసేవాటిని ప్రశ్నపత్రంలోనే ఇస్తారు.

* 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇందులోనే రాయాలి. అదనంగా జవాబు పత్రాలివ్వరు.

* వంద మార్కుల పేపర్‌కు 3.15 గంటలు, 50 మార్కుల పరీక్షకు 2.45 గంటల సమయం ఉంటుంది.

* గతంలోలాగా గ్రేడ్లు ఉండవు. మార్కులు ఇస్తారు.

సాధన చేస్తే బాగా గుర్తుంటుంది

పది రోజుల్లో రోజుకు ఒకటి చొప్పున మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత బాగా గుర్తుంటాయి. గణితం పేపర్‌లో 8 మార్కుల ప్రశ్నలు ఐదు, 4 మార్కుల ప్రశ్నలు ఎనిమిది కలిపి 13 ప్రశ్నలకు 72 మార్కులు పొందేందుకు అవకాశం ఉంది. వీటిని ఎక్కువగా అభ్యాసం చేస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు. సిలబస్‌లోని 12 అధ్యాయాల్లో 10 అధ్యాయాల నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. బహుపదుల గ్రాఫ్‌, స్పర్శరేఖల నిర్మాణం తప్పనిసరిగా ఉంటుంది. సమితులు, వాస్తవ సంఖ్యలు, నిరూప రేఖాగణితం, శ్రేఢుల నుంచి సులభంగా మార్కులు పొందవచ్చు.- జీవీబీఎస్‌ఎన్‌ రాజు, గణిత ఉపాధ్యాయుడు

ఒత్తిడికి లోనైతే ఏకాగ్రత దెబ్బతింటుంది

ఒకటో తరగతి నుంచి రాసే పరీక్షల్లానే వీటిని చూడాలి. భయపడితే ఒత్తిడికి లోనై ఏకాగ్రత, జ్ఞాపశక్తి దెబ్బతింటుంది. తల్లిదండ్రులు మార్కుల గురించి పిల్లలపై ఒత్తిడి తేకూడదు. రాత్రి 10 గంటల్లోపే చదువుకోవాలి. తెల్లవారుజామున నాలుగైదు గంటల నుంచి చదువుకోవడం మంచిది. అన్ని సబ్జెక్టులను ఒకేసారి కాకుండా ఒక్కో సబ్జెక్టును చదువుకుంటూ వెళ్లాలి. చదువు మధ్యలో కొంచెం విరామం ఇవ్వాలి. పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందే చేరుకుంటే ఒత్తిడి ఉండదు. ప్రశ్నపత్రం చేతికందగానే మొత్తం ఓసారి చదవాలి. అప్పుడు మీరు చదివినవి గుర్తుకు వస్తుంటాయి. తెలిసినవాటికి ముందుగా జవాబులు రాయాలి. పరీక్షల వేళ రోజుకు కనీసం 6 గంటల నిద్ర, బలవర్థకమైన ఆహారం, ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. - టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టుల సంఘం అధ్యక్షుడు

మోడల్‌ పేపర్లు పంపించాం
పదో తరగతి పరీక్షల మోడల్‌ పేపర్లను పాఠశాలలకు పంపించాం. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌ చదివితే సరిపోతుంది. చదువులో వెనుకబడిన వారికి ఉపాధ్యాయులు ప్రత్యేక నోట్స్‌ ఇస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధాన పరీక్షలైన గణితం, సామాన్యశాస్త్రాలకు మధ్యలో ఒకటి, రెండు రోజులు విరామం ఇచ్చాం. పరీక్షలో ప్రశ్నపత్రం చదివేందుకు, సమాధానాలు రాసేందుకు 15 నిమిషాలు అదనంగా ఇస్తున్నాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికానక్కర్లేదు. ఉపాధ్యాయలు చెప్పింది చదివితే చాలు. తల్లిదండ్రులు పిల్లల్ని పరీక్షల ముందు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలి. ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు.- దేవానందరెడ్డి, డైరెక్టర్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం

ఇదీ చదవండి:SSC Exams at AP: పదో తరగతి పరీక్షల్లో.. భారీ సంస్కరణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.