ETV Bharat / city

వెదురుతో వెరైటీ కోకలు... అరటితో అందమైన చీరలు..! - news on anakaputhur sarees

పురాణ కాలం నుంచి నార వస్త్రాల గురించి వింటూనే ఉన్నాం. అరణ్య వాసం, తపో వనాలకు వెళ్లే సమయంలో ధరించేవారని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇవి నిరాడంబరతకు చిహ్నం. అంతేకాదు ప్రతికూల వాతావరణంలోనూ శరీరానికి రక్షగా ఉంటాయి. ఇవి అంతరించిపోతున్న వేళ మళ్లీ గుర్తింపు తీసుకొస్తున్నారు చెన్నై సమీపంలోని కాంచీపురం జిల్లాలోని అనకాపుత్తూరు వాసులు.

story on nara sarees in anakaputhur
అనకాపుత్తూరు నార చీరలపై కథనం
author img

By

Published : Dec 15, 2019, 9:01 AM IST

అనకాపుత్తూరు నార చీరలపై కథనం

చెన్నైకి సమీపంలోని అనకాపుత్తూరు... చేనేతకు పెట్టింది పేరు. అక్కడ కార్మికుల్లో అత్యధికులు తెలుగువారు. కాలక్రమేణ చేనేతకు ఆదరణ లేక మగ్గాల సంఖ్య బాగా తగ్గింది. అందుకే వైవిధ్యంగా ప్రయత్నించాడు ఆ పల్లెవాసి శేఖర్. నార వస్త్రాలు నెయ్యాలని సంకల్పించారు.

నార వస్త్రాలంటే అరటి, జనుము, గోంగూర, కలబంద, వెదురు వంటి మొక్కల నుంచి నార వేరు చేసి నేసిన బట్టలు. వాటికి ఆధునిక హంగులు జోడించి తయారు చేయడం శేఖర్​ ప్రత్యేకత. పట్టు, నార కలిపి నార పట్టు వస్త్రాలు సైతం తయారు చేశారు.

అరటి నారతో ప్రారంభించి... 25 రకాల నారలతో వస్త్రాలు తయారు చేశారు. లిమ్కా బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డులోనూ స్థానం సంపాదించారు. 50 రకాల నారలతో వస్త్రాలు నేసి గిన్నిస్​ బుక్​లో స్థానం సంపాదించడం లక్ష్యంతో సాగుతున్నాడీ శేఖర్.

టెక్స్ టైల్ ఇంజినీరింగ్ విద్యార్థులు, విదేశాలకు చెందిన వారు సైతం అనకాపుత్తూరు సందర్శించి నార వస్త్రాల నేతను పరిశీలిస్తున్నారు. విదేశాలకు చెందిన ఆర్డర్లు సైతం వచ్చాయి. భారీ ఆర్డర్లకు తగినట్లు వస్త్రాలు తయారు చేసే ఉత్పత్తి సామర్ధ్యం తమ వద్ద లేదంటున్నారు శేఖర్. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎక్కువ బట్టలు నెయ్యగలమని అంటున్నారు. కేవలం చీరలే కాదు.. చుడిదార్, చొక్కాలు, టీ షర్ట్ మెటీరియల్ సైతం తయారు చెయ్యగలమని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి

ప్లాస్టిక్​ భూతంపై 'స్లమ్​డాగ్​ సైంటిస్టు'ల రోబో అస్త్రం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.