ETV Bharat / city

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్ - cm jagan inaugrates help desks in police stations

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం జగన్ ‌శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారత సాధించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ సందర్భంగా.. మహిళల భద్రత కోసం దిశ వాహనాలను, దిశ క్రైం సీన్ మేనేజ్‌మెంట్ వాహనాలు ప్రారంభించారు.

cm jagan on womens day
మహిళలకు సామాజిక సాధికారత కల్పించేలా చర్యలు: సీఎం
author img

By

Published : Mar 8, 2021, 12:57 PM IST

Updated : Mar 8, 2021, 1:42 PM IST

మహిళలకు సామాజిక సాధికారత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం: సీఎం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో జెండర్‌ బడ్జెట్‌ ఆలోచన తీసుకొస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్​గా దిశ వాహనాలు ప్రారంభించిన ఆయన.. మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 900 దిశ వాహనాలతో పాటు దిశ కియోస్క్ యంత్రాలు, 18 దిశ క్రైం సీన్ మేనేజ్‌మెంట్ వాహనాలను.. వర్చువల్ విధానం ద్వారా ఆయన ప్రారంభించారు. సచివాలయంలో మహిళలపై వేధింపుల నివారణ కమిటీ లేదని.. తొలుత సచివాలయం నుంచే ఈ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా కమిటీ తప్పక ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాటిపో పాటు,

మహిళలపై నేరాలను తగ్గించగలిగాం

రాష్ట్రంలోని 18 దిశ స్టేషన్లకు.. ఒక్కో వాహనం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి జిల్లాలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, కోర్టులు ఏర్పాటు చేస్తామని.. మహిళలపై నేరాలను 7.5 శాతం తగ్గించగలిగామన్నారు. దర్యాప్తు సమయాన్ని 100 నుంచి 53 రోజులకు తగ్గించినట్లు తెలిపిన ముఖ్యమంత్రి.. 563 నేరాలకు వారంలోగా ఛార్జ్‌షీట్లు తయారుచేశామన్నారు. దిశ పెట్రోలింగ్‌కు 900 స్కూటీలు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. అనంతరం మహిళా హెల్ప్ డెస్క్‌లు ప్రారంభించిన ఆయన.. నేటి నుంచి అన్ని పోలీస్ స్టేషన్​లలో ఇవి అందుబాటులో ఉంటాయన్నారు.

వారి పట్ల వివక్షతో సమాజ ప్రగతికి ఇబ్బందులు

డ్వాక్రా మహిళలు క్రియాశీలకంగా ఉన్నారని.. ఇంటిని బాగు చేసుకోవాలనే తాపత్రయం మహిళల్లో పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. 40 శాతం మహిళలు ఇప్పటికీ చదువుకు దూరంగా ఉన్నారని వివరించారు. మహిళల పట్ల వివక్షతో సమాజ ప్రగతికి ఇబ్బందులు ఏర్పుడుతున్నాయన్నారు. గత పాలకులు మహిళలను కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు.

మహిళలకు అండగా అనేక పథకాలు

మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు అడుగులు వేస్తున్నామని.. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. చదువురాని వాళ్లు ఉండకూడదనే అమ్మఒడి పథకం, ఆడపిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదవాలని పథకాలు చేపట్టినట్లు సీఎం జగన్‌ తెలిపారు. 44.5 లక్షల ఖాతాల్లో.. 85 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి పథకం చేకూరుతుందని.. దీనికోసం రెండేళ్లలో రూ.13,022 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.. అమ్మఒడి, ఆసరా, చేయూతతో మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తారని అన్నారు.

బయోడిగ్రేడెబుల్ సానిటరీ న్యాప్​కిన్స్​ను విద్యార్థులకు ఇచ్చేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. జులై 1 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

'స్త్రీ సమానత్వం, సాధికారతే సమాజ ప్రగతికి మూలం'

Last Updated : Mar 8, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.