ETV Bharat / city

ఆంధ్రాలో రూపుదిద్దుకుంటున్న కర్నల్ సంతోష్​బాబు విగ్రహం - Santosh Babu statue latest news

చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలుగు తేజం కర్నల్‌ సంతోష్‌బాబు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఆయన గౌరవార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

statue-of-colonel-santosh-babu
ఆంధ్రాలో రూపుదిద్దుకుంటున్న కర్నల్ సంతోష్​బాబు విగ్రహం
author img

By

Published : Jun 26, 2020, 9:31 AM IST

భారత్‌-చైనా సరిహద్దుల్లో గల్వాన్‌ ఘర్షణలో అమరుడైన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబు విగ్రహం ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లాలో రూపుదిద్దుకుంటోంది.

పెనుమంట్ర మండలం గర్వు గ్రామానికి చెందిన ఏకే ఫైన్‌ ఆర్ట్స్‌ శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్‌, కరుణాకర్‌ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. శిల్పులు మాట్లాడుతూ దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సంతోష్‌బాబు విగ్రహ తయారీ అవకాశం తమకు రావడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'శారీరక శ్రమతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.