ETV Bharat / city

ముగిసిన రెండో విడత నామినేషన్ల ప్రక్రియ

రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజున వివిధ పార్టీల మద్దతుదారులతో నామినేషన్ కేంద్రాలు కిటకిటలాడాయి.

statewide second phase of  nomination process is over
రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన రెండో విడుత నామినేషన్ల ప్రక్రియ
author img

By

Published : Feb 4, 2021, 6:26 PM IST

Updated : Feb 4, 2021, 8:00 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు పక్రియ ముగిసింది. చివరి రోజు కావటంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి భారీగా తరలివచ్చారు.

అనంతపురం జిల్లాలో

అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నామినేషన్ల కార్యక్రమం జోరుగా సాగింది. నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావటంతో అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సర్పంచి, వార్డు స్థానాలకు నామినేషన్లు వేయడానికి కేంద్రాల వద్ద బారులు తీరారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పరిశీలించారు.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా పామర్రు, పెదపారుపూడి మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కోలాహలంగా జరిగింది. పామర్రులో వైకాపా బలపర్చిన సర్పంచి అభ్యర్థితో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నామినేషన్ వేయించారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు తుది రోజు కావడంతో నామినేషన్ కేంద్రాలు అభ్యర్థులతో కిటకిటలాడాయి. పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు అభ్యర్థులు తరలివచ్చారు.

విజయనగరం జిల్లాలో..

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పోటాపోటీగా సాగింది. అభ్యర్థులు భారీ ఊరేగింపుతో వచ్చి నామినేషన్లు వేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్​, ఉండ్రాజవరంలో చివరి రోజున భారీ సంఖ్యలో పోటీదారులు నామినేషన్ దాఖలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు తమ మద్దతుదారులతో కలిసి ఊరేగింపుగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పెద ఉల్లగల్లు పంచాయతీకి నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు బారులు తీరారు.ముండ్లమూరు పంచాయతీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన 167 మందికి అధికారులు నెంబర్ల ప్రకారం టోకెన్లు జారీ చేశారు. 07గంటల సమయానికి 25వ నంబరు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ అర్ధరాత్రి వరకు పడుతుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: తొలిదశ ఎన్నికలకు ముగిసిన నామినేషన్‌ ఉపసంహరణ గడువు

Last Updated : Feb 4, 2021, 8:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.