ETV Bharat / city

అడుగడుగునా శివతత్వం... అణువణువూ శివమయం... - రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, కోటప్పకొండ, శ్రీకాళహస్తిల్లో భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులతో శివాలయాలు కిటకిటలాడాయి. మేళ తాళాలు, డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య స్వామివారి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు.

STATE WISE SHIVARATHRI CELEBRATIONS
రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు
author img

By

Published : Feb 22, 2020, 12:06 AM IST

రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ...

మహా శివరాత్రి పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గా లక్ష్మణేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పురవీధుల్లో స్వామివారిని పల్లకిపై ఊరేగించిన అనంతరం రథోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

కడప జిల్లాలో...

మహాశివరాత్రి సందర్భంగా కడప జిల్లాలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. జమ్మలమడుగు సోమేశ్వరస్వామి ఆలయం ఆవరణలో దీపాలు వెలిగించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సామూహిక రుద్రాభిషేకాలు, అన్నపూర్ణ అభిషేకం నిర్వహించారు. మేళతాళాల నడుమ స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరిపించారు.

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం సంగమేశ్వరాలయం శివనామ స్మరణతో మార్మోగింది. త్రివేణి సంగంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన స్వామివారిని దర్శించుకున్నారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

తూర్పుగోదావరి జిల్లాలో...

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కొత్తపేట మండలం పలివెలలో శ్రీ ఉమాకొప్పేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సామర్లకోటలోని పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. రంపచోడవరం మండలంలోని రంపలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జునస్వామి అలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న కొమ్ము, రెలా నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తునిలో బ్రహ్మకుమారీస్ మందిరంలో సోమనాథ్ ఈశ్వర వజ్ర లింగ స్వరూపాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.

చిత్తూరు జిల్లాలో...

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రముఖ శైవ క్షేత్రాలైన తలకోన ,ముక్కోటి ,శేషాచల లింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విజయనగరం జిల్లాలో...

విజయనగరం జిల్లా సాలూరులో శ్రీ ఉమా రామలింగేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. బొబ్బిలిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కర్నూలు జిల్లాలో...

కర్నూలు జిల్లా మహానంది మండలం సూర్యనంది క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. మహానందీశ్వర స్వామికి తొలిసారిగా రావణ వాహన సేవ ఏర్పాటు చేశారు. మహానందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరిదేవి ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై ఊరేగించారు. బనగానపల్లె మండలం యాగంటిలో కొలువైన నందీశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుహ, అగస్త్య మహాముని గుహను సందర్శించుకున్నారు. నందవరం మండలం గురుజాలలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో భక్తులు హాజరయ్యారు. ఆదోనిలోని శాంతి మల్లప్ప కొండ, శంబులింగేశ్వర స్వామి దేవాలయం, సంతపేట నాగలింగేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదోనిలోని శాంతి మల్లప్ప కొండ, శంబులింగేశ్వర స్వామి దేవాలయం, సంతపేట నాగలింగేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరు జిల్లా సీతారామపురం ఘటిక సిద్ధేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగాయి. ఈ ఉత్సవాలకు నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, కడప, గుంటూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. మద్దికెరలో ఉన్న శివాలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు.

కృష్ణా జిల్లాలో...

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో భక్తులు పోటెత్తారు. వేద మంత్రాలతో పండితులు బలిహరణ కార్యక్రమం నిర్వహించి స్వామివారి ఉత్సవాలను నిర్వహించారు.

విజయవాడలో...

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పటమట లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. అవధూత దత్త పీఠంలో శ్రీ గంగాధరేశ్వర స్వామి ఆలయంలో స్పటిక లింగానికి అభిషేకాలు చేసి విశేష పూజలు చేశారు.

విశాఖపట్నం జిల్లాలో...
విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన నిర్వహించారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం పేరేచర్లలో కొలువై ఉన్న కైలాసనాథేశ్వరస్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యోల భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో శంకరుణికి పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.