ETV Bharat / city

కరోనా వ్యాక్సినేషన్​కు ఏర్పాట్లు పూర్తి - ఏపీ కరోనా వ్యాక్సినేషన్ అప్​డేట్

రాష్ట్రంలోని వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ కరోనా వ్యాక్సిన్ వయల్స్ చేరుకున్నాయి. పూర్తి పోలీసు బందోబస్తు మధ్య వయల్స్​ను ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లలో భద్రపరిచారు. రేపు ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

vaccination
కరోనా వ్యాక్సినేషన్​కు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Jan 15, 2021, 2:59 PM IST

కరోనా వ్యాక్సినేష్ ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రానికి చేరుకున్న వ్యాక్సినేషన్ వయల్స్​ను వివిధ జిల్లాలకు పంపించారు. తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యారోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​ను వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 87 వేల 983 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలివిడతలో కరోనా వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1940 ఆరోగ్య కేంద్రాల్లో తొలివిడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు, వాక్ ఇన్ ఫ్రీజర్ గదులను ఏర్పాటు చేసి.. 1659 చోట్ల వ్యాక్సిన్ వయల్స్ వైద్యారోగ్యశాఖ భద్రపరిచింది. సమీపంలోని మిగతా కేంద్రాలకు వ్యాక్సిన్​ను క్యారియర్ బాక్సుల్లో తరలించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం తొలివిడతలో వైద్యారోగ్య సిబ్బందికి 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేశారు. ప్రతీ కేంద్రంలోనూ వంద మందికి వ్యాక్సినేషన్ వేసేలా ప్రణాళిక చేశారు.
మరోవైపు వాక్సినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాక్సినేషన్ కోసం వచ్చే ప్రతీ వైద్యారోగ్య సిబ్బందికీ ముందుగానే కోవిన్ యాప్ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని పంపించారు. వాక్సినేషన్ కోసం వచ్చే వైద్యారోగ్య సిబ్బంది గుర్తింపు కార్డును వెంట తీసుకురావాల్సిందిగా సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కోనేందుకు వైద్య సిబ్బందిని నియమించారు.

ఇదీ చదవండి: అందని పెట్టుబడి రాయితీ... కర్షకుల ఇంట కనిపించని సంక్రాంతి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.