గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే విక్రయించాలని దుకాణాల యజమానులకు పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీలు , పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ... ఈ మేరకు ఆదేశాలిచ్చారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలన్నారు. బాణసంచా దుకాణాలు నిబంధనలు పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని...ఒక్కో దుకాణానికి మధ్య 10 అడుగుల దూరం ఉండేలా చూడాలని వివరించారు. గ్రీన్ క్రాకర్స్ ద్వారా సాధారణమైన టపాసుల కంటే 30 శాతం తక్కువ కాలుష్యం వెలువడుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇదీ చదవండి