ETV Bharat / city

జులైలో ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు.. నిర్వహించే యోచనలో విద్యాశాఖ - జులైలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచన

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జులైలో ఇంటర్, డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అలాగే ఇంజినీరింగ్‌లో ..ఇంజినీరింగ్‌ చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

inter and degree exam on July month at ap
జులైలో ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు
author img

By

Published : Jun 10, 2021, 3:57 AM IST

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే నెలలో ఇంటర్‌, ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు. వచ్చే నెల ఇంటర్‌ పరీక్షలు పూర్తయితే ఆగస్టులో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు ఉంటాయి. సెప్టెంబరులో తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది.

ఇంజినీరింగ్‌లో ఇలా.. ఇంజినీరింగ్‌ చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు తొలుత పరీక్షలుంటాయి. విద్యార్థుల వెసులుబాటుకు 2 పర్యాయాలుగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఒకసారి, అప్పుడు రాలేని వారికి మరోసారి పరీక్షలు పెడతారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన వారు, ఉన్నత చదువులకు వెళ్లాలనుకునేవారు మొదట పరీక్షలు రాయొచ్చని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలు జాప్యమైతే వీరికి ఇబ్బందులొచ్చే అవకాశం ఉన్నందున రెండు విడతల పరీక్షల విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులకూ ఇదే విధానం అమలుచేయాలని భావిస్తున్నారు.

ఇదీ చదవండి..

Ap Corona Cases: కొత్తగా 8,766 కేసులు, 67 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.