ETV Bharat / city

విద్యాసంస్థలకు మ్యాపింగ్... ఆదేశాలు జారీ - ap governament latest news

కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలనూ మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్ధులు, ఉపాధ్యాయుల హాజరు తోపాటు గ్రామ వార్డు సచివాలయాల వారీగా ఈ వివరాలను నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యాసంస్థలకు మ్యాపింగ్ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Nov 30, 2020, 7:51 PM IST

కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలనూ మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తోపాటు గ్రామ వార్డు సచివాలయాల వారీగా ఈ వివరాలను నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అన్​లాక్ ప్రక్రియలో భాగంగా విద్యాసంస్థలు దశలవారీగా తెరవాలని నిర్ణయించటంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను సేకరించేందుకు మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టినట్టు తెలియచేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా విద్యా సంస్థల వివరాలను, విద్యార్ధులు, అధ్యాపకుల వివరాలను సేకరించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఈ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. స్థానికంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలను ట్యాగింగ్ చేసి వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం సూచించింది.

విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలని ఆదేశాలు...

కోవిడ్ పరిస్థితుల రీత్యా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హాజరు శాతాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్​లాక్ ప్రక్రియకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలలను తెరుస్తుండటంతో కోవిడ్ వ్యాప్తిని పరిశీలించేందుకు హాజరు శాతాన్ని నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన పట్టిక ఆధారంగా వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచనలు జారీ అయ్యాయి. ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్, అటానమస్ విద్యా సంస్థలు... ప్రతీ వారం ఈ పట్టిక ఆధారంగా విద్యార్ధుల హాజరు, ఇతర వివరాలను వైద్యారోగ్యశాఖ కమిషనర్ కు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి

ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.