ETV Bharat / city

రుషికొండ తవ్వకాలపై.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం - ఏపీ తాజా వార్తలు

Rushikonda excavations: విశాఖ పట్నంలోని రుషికొండ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తవ్వకాలను నిలిపివేయాలన్న ఎన్జీటీ ఆదేశాలను సవాల్​ చేస్తూ పిటిషన్​ వేసింది. ఎన్జీటీ స్టే ఇస్తూ.. ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని, రిషికొండలో తవ్వకాలు, నిర్మాణాలకు అనుమతివ్వాలని పిటిషన్‌లో పేర్కొంది.

Supreme Court
రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
author img

By

Published : May 23, 2022, 3:23 PM IST

Updated : May 23, 2022, 5:32 PM IST

Rushikonda excavations: విశాఖపట్నం సాగర తీరంలోని రుషికొండ తవ్వకాలపై స్టే విధిస్తూ... ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ - ఎన్జీటీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం... సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తరువాతే రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లు పేర్కొన్న ఏపీ ప్రభుత్వం.. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా తవ్వకాలు, నిర్మాణాలు చేపడతున్నట్లు పిటిషన్‌లో పేర్కొంది. రిషికొండ వ్యవహారంపై... ఎంపీ రఘురామ కృష్ణరాజు గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన ఎన్జీటీ... ఈనెల 6న తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి తవ్వకాలు జరపరాదని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకు జరిపిన తవ్వకాలపై అధ్యయనం చేసిందుకు సంయుక్త కమిటీ నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. నెల రోజుల్లో పూర్తి అధ్యయనం చేసి నివేదిక అందించాలని కమిటీని ఆదేశించింది.

నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ఆధారిటీ, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ ఆధారిటి, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్‌ కోస్టల్ మేనేజ్మెంట్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి... ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ ఆధారిటి నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తుందని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్జీటీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ ఇచ్చిన ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్​ చేసింది. ఎన్జీటీ స్టే ఇస్తూ.. ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని, రిషికొండలో తవ్వకాలు, నిర్మాణాలకు అనుమతివ్వాలని పిటిషన్‌లో పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : May 23, 2022, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.