ETV Bharat / city

ఏపీ నుంచి వచ్చే ఉద్యోగుల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు - హైదరాబాద్​ తాజా వార్తలు

రాష్ట్ర విభజనలో ఏపీకి వెళ్లిన ఉద్యోగులు తెలంగాణకు రానున్నారు. వచ్చే ఉద్యోగులను ఎక్కడ నియమించాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారిని కేటాయించేందుకు వీలుగా రాష్ట్ర సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లలో ఖాళీల వివరాలు కోరుతూ లేఖలు రాసింది.

employees
ఏపీ నుంచి వచ్చే ఉద్యోగుల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
author img

By

Published : Jan 11, 2021, 11:40 AM IST

ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు రానున్న ఉద్యోగులను ఎక్కడ నియమించాలనే దానిపై కేసీఆర్ సర్కారు కసరత్తు చేపట్టింది. వారిని కేటాయించేందుకు వీలుగా రాష్ట్ర సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లలో ఖాళీల వివరాలు కోరుతూ లేఖలు రాసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఏపీకి వెళ్లారు. అప్పటి నుంచి వారు స్వరాష్ట్రానికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు ప్రభుత్వాలను కోరడంతో పాటు ఆందోళనలు చేశారు. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు స్పందించి చర్చించారు.

ఏపీ ప్రభుత్వం అంగీకారం

చివరకు తమ వద్ద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను పంపడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా తెలంగాణ సీఎం.. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం సందర్భంగా ఏపీలోని ఉద్యోగులను వెంటనే రప్పిస్తామని తెలిపారు. దీనికి అనుగుణంగా ఆయన ఆదేశాలు జారీ చేయగా సీఎస్‌ వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాశారు. ఏపీ నుంచి ఉద్యోగులను పంపించడానికి మరోసారి అక్కడి ప్రభుత్వం సన్నద్ధత తెలిపింది. మొదట్లో వెయ్యి మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు తెలంగాణకు రావాల్సిన జాబితాలో ఉండగా వారిలో పదవీ విరమణలు పోగా ప్రస్తుతం 741 మంది మిగిలారు.

ఖాళీలు లేకపోతే జిల్లాల కలెక్టరేట్లకు...

ఏపీ నుంచి వచ్చే ఉద్యోగుల్లో అటెండర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. గతంలో వీరిని తెలంగాణలో నియమించడానికి సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని అధికారులు నివేదించారు. ఏపీ నుంచి వచ్చే వారిలో 203 మంది సచివాలయంలో, 538 మంది శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. రాష్ట్ర సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ మేరకు ఖాళీలుంటే కొత్త పోస్టులను సృష్టించే అవసరం లేకుండా వారిని అక్కడ నియమిస్తారు. ఖాళీలు లేకపోతే జిల్లాల కలెక్టరేట్లకు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి:

కొవిడ్ మహత్యం... పుట్టుకొచ్చిన కొత్త వ్యాపారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.