రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బిల్లులపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో చర్చించినట్లు.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు స్పష్టం చేశారు. దిల్లీలో పర్యటనలో ఉన్న బుగ్గన.. మరో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీని కలిశారు. రాష్ట్రంలో 31 లక్షల పేదలకు పట్టాలు అందించామని.. ఆ స్థలాల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించాలని కోరినట్లు బుగ్గన తెలిపారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ఇండిగో రాకపోకలపై చర్చించామన్నారు.
కరోనా దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా ఇవ్వాలని కోరినట్లు బుగ్గన తెలిపారు. విభజన చట్టం మేరకు ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు నిధులపై చర్చించామని.. పోలవరంపై గతప్రభుత్వం చేసిన పొరపాట్లును సైతం కేంద్రమంత్రులకు వివరించామన్నారు. గతప్రభుత్వం చేసిన తప్పుడు ఒప్పందాలను కేంద్రానికి తెలిపామన్నారు.
ఇదీ చదవండి: సింగిల్ బెంచ్ తీర్పు సుప్రీం నిబంధనలకు విరుద్ధం: ఎస్ఈసీ