ETV Bharat / city

'పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టండి'

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో రాష్ట్ర భాజపా నేతలు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టాలని నేతలు కోరారు. భాజపా నేతల బృందం రెండ్రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది.

గజేంద్రసింగ్‌ షెకావత్‌తో రాష్ట్ర భాజపా నేతలు భేటీ
author img

By

Published : Oct 13, 2019, 11:04 PM IST

Updated : Oct 13, 2019, 11:30 PM IST

గజేంద్రసింగ్‌ షెకావత్‌తో రాష్ట్ర భాజపా నేతలు భేటీ

దిల్లీలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు భేటీ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ, సుజనాచౌదరి, సునీల్ దేవధర్‌, మాధవ్‌, ఇతర నేతలు షెకావత్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టాలని నేతలు కోరారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులతోపాటు పునరావాస ప్యాకేజ్‌నూ అమలు చేయాలని విన్నవించారు. భాజపా నేతల బృందం రెండ్రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది.

కేంద్రమంత్రిని కలిసిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలని తమ కోరికని ఉద్ఘాటించారు. పోలవరాన్ని తెదేపా, వైకాపా ప్రభుత్వాలు రాజకీయంగానే చూశాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును తెదేపా ప్రభుత్వం పర్యటక స్థలంగానే చూసిందన్న కన్నా... పోలవరం నిర్మాణంపై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. పోలవరం త్వరగా పూర్తయ్యేలా చూస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని వివరించారు.

ఇదీ చదవండీ... రైతుభరోసాకు రూ.5,510 కోట్లు విడుదల

Kovalam (Tamil Nadu), Oct 12 (ANI): After informal summit in Mamallapuram, Prime Minister Narendra Modi and President Xi Jinping in Kovalam. Leaders held one-on-one talk in coastal city. They will also hold delegation level talks. Chinese President and PM Modi arrived in Kovalam earlier today. President Xi is on a two-day visit.
Last Updated : Oct 13, 2019, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.