ETV Bharat / city

'రాష్ట్రంలో కొవిడ్ ​- 19(కరోనా) భయం లేదు.. అప్రమత్తంగా ఉన్నాం' - ఏపీలో కొవిడ్-19 వార్తలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్ - 19(కరోనా) వైరస్​ రాష్ట్రంలో ఎవరికీ సోకలేదని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, పూర్తి స్థాయిలో ముందస్తు చర్యల్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

state alert on covid-19(corona) said by the Ministry of Health, Health and Family Welfare Special Secretary KS Jawahar Reddy
'రాష్ట్రంలో ఒక్క కొవిడ్​-19 కేసు నమోదు కాలేదు'
author img

By

Published : Feb 15, 2020, 7:06 AM IST

రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్క కొవిడ్ - 19 కేసు కూడా నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. నిఘా, నియంత్రణ చర్యల్ని మరింత బలోపేతం చేశామని అన్నారు. కొవిడ్-19 బాధిత దేశాల నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 130 మంది ప్రయాణికులు వస్తే, వారిలో 125 మంది తమ ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. మరో ఐదుగురికి 28 రోజుల పర్యవేక్షణ పూర్తయ్యిందని అన్నారు. ఆరుగురి శాంపిళ్లను నిర్ధరణ కోసం పంపితే అవి నెగిటివ్ అని తేలిందన్నారు. ప్రభుత్వం జారీ చేసే ఆరోగ్య సలహాల్ని తప్పకుండా పాటించాలని, ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, పూర్తి స్థాయిలో ముందస్తు చర్యల్ని చేపట్టామని పేర్కొన్నారు. 24 గంటలూ పనిచేసే కంట్రోల్ సెంటర్​ను ఏర్పాటు చేయడం సహా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారుల్ని నియమించామని తెలిపారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే మాస్క్​ల కోసం సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, 24 గంటలూ అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ సెంటర్ నెంబరుకు, 1100, 1902 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:

వైద్యులపైనే కరోనా పంజా - చైనాలో ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.