లాక్‌డౌన్ సమయంలో వీరికి అదనంగా 5కిలోలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి మరికొంత కలిపి ఆహారధాన్యాలు అందించాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీరిలో చాలామంది అర్హులైన వారికి ఆహార ధాన్యాలు అందలేదని వెల్లడించారు. చాలావరకూ పేదలు వివిధ కారణాల వల్ల తమకు అందాల్సిన రేషన్‌ను పొందలేకపోయారు.
ఆహార శాలలతో మేలే..
సాధారణ పరిస్థితుల్లోనే దారిద్య రేఖకు దిగువన ఉన్నవారు ఆకలితో అలమటిస్తున్న సందర్భాలెన్నో. అలాంటిది.. కరోనా సమయంలో వారి పరిస్థితి చెప్పనవసరంలేదు. పేదలే కాదు దిగువ మధ్యతరగతీ పూట గడవడానికి ఇబ్బందులు పడినవారే. ఇలాంటి సమయాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆహార క్యాంటీన్లు కొంతమేర ఆదుకున్నాయి. ఈ నేపథ్యంలోనే.. దేశంలో పేదరికం ఉన్నంతవరకూ ప్రభుత్వ ఆహారశాలలు కొనసాగించడమే మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. కొవిడ్ వల్ల జీవనోపాధి కోల్పోయిన లక్షలమంది మృత్యువాత పడకుండా ఆపాలంటే ఈ ఆహార శాలల ద్వారా పోషణ అందించడం తప్పనిసరి అని అంటున్నారు.
ప్రభుత్వాలదే బాధ్యత
మరోవైపు కరోనాలో లక్షలాది వలస కార్మికులకు ఆహారం అందించడానికి వీలుగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 11వేల కోట్లు అందించింది. అయినా చాలా రాష్ట్రాలు సకాలంలో వలస కార్మికులకు ఆదుకోలేకపోయాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆహర భద్రతకు ముప్పు రాకుండా.. ప్రజలెవరూ ఆకలితో అలమటించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ముఖ్యంగా.. ఆకలితో అలమటిస్తున్న పేదలకు సరైన ఆహార భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత స్పష్టంగా వివరించింది కరోనా. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా... ప్రజలు తిండి దొరక్క అవస్థలు పడే పరిస్థితులను రాకుండా ఉండేలా చేయాలి.
పెడచివిన పెట్టొద్దు
తక్షణమే ప్రభుత్వాలు మేల్కొని రక్షణ చర్యలు చేపట్టకపోతే దారుణ పరిణామాలు ఎదుర్కో వాల్సి వస్తుందన్న ఐరాస హెచ్చరికలు ఏమాత్రం పెడచెవిన పెట్టే అవకాశం లేదు. ఏమాత్రం మేల్కోకపోయినా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండనున్నాయి. రానున్న రోజుల్లో ఎదురయ్యే ఆహార సంక్షోభం చాలా భిన్నమైనది, తీవ్రమైనది.. గతంలో ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నిపుణులు చెపుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని ఐరాస అంటోంది.
ఇదీ చదవండి: అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..