ETV Bharat / city

పర్యటక ప్రాంతాల్లో నక్షత్ర హోటళ్లు, రిసార్టులు..! - ఏపీలోని టూరిస్టు ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు

జాతీయ, అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షించేందుకు... రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పర్యటక ప్రాంతాల్లో సందర్శకుల సౌకర్యార్థం పీపీపీ విధానంలో... నక్షత్ర హోటళ్లు, రిసార్ట్​లు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధిం చేసింది.

పర్యటక ప్రాంతాల్లో నక్షత్ల హోటళ్లు, రిసార్టులు
author img

By

Published : Nov 16, 2019, 8:07 PM IST

పర్యటక ప్రాంతాల్లో నక్షత్ర హోటళ్లు, రిసార్టులు..!

జాతీయ, అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నక్షత్ర హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తం 6 జిల్లాల్లోని పర్యటకశాఖ భూముల్లో వీటి నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలో మఖ్యమంత్రి జగన్​తో సమావేశమై... టెండరు ప్రక్రియ చేపట్టాలని పర్యటక శాఖ భావిస్తోంది.

రాష్ట్రంలో పర్యటకులు ఎక్కువగా సందర్శిస్తున్న జిల్లాల్లో చిత్తూరు, విశాఖ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. పర్యటకులను ఆకర్షించేందుకు... వారికి సౌలభ్యంగా ఉండేలా నక్షత్ర హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు పర్యటక శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం పలు జిల్లాల్లో 769 ఎకరాల భూమిని సమీకరించింది.

ప్రైవేట్‌ సంస్థలకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ... నక్షత్ర హోటళ్లు, రిసార్ట్‌లు ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించబోతోంది. విధివిధానాలను నెలాఖరులోగా ఖరారు చేయనుంది. నిపుణులు, ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశం అనంతరం... పర్యటక శాఖ కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. హోటళ్లు, రిసార్టుల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానిస్తోంది.

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలోనూ 5 నక్షత్ర హోటళ్ల సంఖ్య పెరిగేలా... ఆయా హోటళ్లలో బస చేసే భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా ప్రత్యేక ప్యాకేజీని... తితిదేతో చర్చించి రూపొందించాలని పర్యటకశాఖ భావిస్తోంది. హోటళ్లు పెరిగితే సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావించిన ప్రభుత్వం... పలు జిల్లాల్లో పర్యటక శాఖకు చెందిన భూముల్లో 3, 5, 7 కేటగిరీల్లో నక్షత్రాల హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు... పెట్టుబడులు పెట్టేలా ప్రైవేట్‌ సంస్థలను ఆహ్వానించబోతోంది.

ఇదీచదవండి...

కాళ్లు చేతులు కోల్పోయి... మళ్లీ కుంచె పట్టి...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.