ఎస్సెస్సీ బోర్డు సంచాలకుడు సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన ఉద్యోగుల్లో ముగ్గురిని మంగళవారం సస్పెండు చేశారు. డిప్యూటీ కమిషనరు శ్రీనివాస్, పర్యవేక్షకులు ఎల్లాలు, చంద్రభూషణ్‌రావులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఉద్యోగుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, విధుల్లో అశ్రద్ధ, ఆందోళనలో పాల్గొన్నారంటూ సస్పెన్షన్ ఆదేశాలను కార్యాలయం తలుపులకు అతికించారు. వాటిని చించేశారంటూ ఎల్లాలు, చంద్రభూషణ్‌రావుపై సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలపై సంచాలకుడు సుబ్బారెడ్డిని కలిసేందుకు వెళ్లగా దుర్భాషలాడుతూ భౌతికదాడి చేశారని ఆరోపిస్తూ కార్యాలయంవద్ద ఆగస్టు 27న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సుబ్బారెడ్డిని బదిలీ చేయాలి: ఏపీ ఎన్‌జీవో సంఘం
ఎస్సెస్సీ బోర్డు సంచాలకుడు సుబ్బారెడ్డిని బదిలీ చేయాలని ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండు చేశారు. ఉద్యోగులకు మద్దతుగా ఎస్సెస్సీ బోర్డు కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగలపై వేధింపులను ఆపాలని, ఉద్యోగుల సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం బుధవారంలోగా నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: PAWANKALYAN TWEET: స్టాలిన్‌ను అభినందిస్తూ పవన్‌కల్యాణ్ ట్వీట్