ETV Bharat / city

SRSP: శ్రీరాం సాగర్​కు రికార్డు స్థాయిలో వరద - srsp Floods latest news

ఎడతెరిపిలేని వర్షాలతో ఈసారి తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. గోదావరి ఉప్పొంగడంతో రెండు రోజుల్లోనే జలాశయం పూర్తిగా నిండిపోయింది. ఈ నెల 22న ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో వరద చేరిందని అధికారులు చెబుతున్నారు. జులై నెలలో ఇంత ఎక్కువ వరద రావడం కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరిగిందని వెల్లడించారు.

srsp
శ్రీరాం సాగర్
author img

By

Published : Jul 25, 2021, 6:48 AM IST

తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ నెల 22న రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. 6 గంటల్లోనే 9 టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి ఏకంగా 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదలాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. జూన్ 1న ప్రాజెక్టులో కేవలం 18 టీఎంసీల నీరు ఉండగా.. జులై 1 నాటికి అది 27 టీఎంసీలకు చేరింది. జులై 16న ఒక్కరోజే 10 టీఎంసీల నీరు రాగా.. 21న సైతం 10 టీఎంసీలు చేరింది. ఇక జులై 22న ప్రాజెక్టు పూర్తిగా నిండిపోగా.. ఆ రోజు మధ్యాహ్నం గేట్లు ఎత్తి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 45.3 టీఎంసీలు దిగువకు వదిలారు.

ఎస్సారెస్పీ చరిత్రలో రెండో అత్యధిక ఔట్​ ఫ్లో ఈ ఏడాది రికార్డైంది. 1983లో 9 లక్షల క్యూసెక్కులు వదలగా.. ఈ నెల 22న 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. జులై నెలలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం తక్కువ సందర్భాల్లో జరిగింది. ఈ ఏడాది జులైలో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 98.5 టీఎంసీలు ప్రాజెక్టులో చేరితే.. అదే సమయానికి 45.3 టీఎంసీలు దిగువకు వదిలారు. 1989 జులైలో అత్యధికంగా 250 టీఎంసీల నీరు రాగా.. 199 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

2016కు ముందు మూడేళ్లకు ఒకసారి సరాసరిగా ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద వచ్చింది. కానీ మూడేళ్లుగా ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఎస్సారెస్పీ చరిత్రలోనే తొలిసారి ప్రాజెక్టు గేట్లు 12 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు గేట్లు 15 ఫీట్ల వరకు ఎత్తే వీలుండగా.. ఒకేసారి 42 గేట్లు ఎత్తితే 16 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.

ఇదీ చదవండి: ఊళ్లను ముంచేసిన గోదారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.