శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్ర ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో హైదరాబాద్కు చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈ మోహన్ కుమార్, ఏఈ ఫాతిమా మృత దేహాలు నగరానికి చేరుకున్నాయి. డీఈ శ్రీనివాస్ మృతితో చంపాపేటలోని ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. విధులు ముగించుకుని ఉదయం ఇంటికి రావాల్సిన అతను విగతజీవిగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు పడుతున్న ఆవేదనను ఆపడం.. ఎవరి తరం కావడం లేదు.
మరో వైపు మేడ్చల్ జిల్లా సుచిత్రా భాగ్యలక్ష్మి కాలనీలోని ఏఈ మోహన్ కుమార్ ఇంటి వద్ద రోదనలు మిన్నంటాయి. మృతదేహనికి ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుల్లో మరో ఏఈ ఫాతిమా మృతదేహనికి కుటుంబ సభ్యులు అజంపురాలోని స్మశాన వాటికలో గత రాత్రి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వారి ఇళ్ల వద్ద నెలకొన్న విషాదకర పరిస్థితి.. కంటతడి పెట్టించింది.
ఇవీ చూడండి: