ETV Bharat / city

తెలంగాణ: సావిత్రమ్మ సకినాలకు ఉన్న క్రేజే వేరప్ప...

author img

By

Published : Oct 20, 2020, 2:09 PM IST

సకినాలు చేసినా.. సర్వపిండి వండినా వాటిల్లో ఉప్పూ, కారంతో పాటూ కాస్తంత ఆప్యాయతను కూడా కలుపుతారేమో ఆమె. అందుకే ఆ పిండివంటలని తిన్నవాళ్లంతా ఆమెని ‘సకినాల సావిత్రమ్మ’ అంటారు ఇష్టంగా! ఆమె దగ్గర పనిచేసేవాళ్లైతే ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తారు.. హైదరాబాద్‌కు చెందిన డెబ్భై ఆరేళ్ల వంగపల్లి సావిత్రమ్మ చేసే పిండి వంటకాలకు సామాన్యుల నుంచి వీఐపీల వరకూ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

సావిత్రమ్మ సకినాలకు ఉన్న క్రేజే వేరప్ప...

అమ్మాయికి పంపే సారెలో.. సావిత్రమ్మ చేసిన పిండి వంటలుంటే పెళ్లికూతురు తల్లికి ఓ భరోసా. వియ్యంకుల వారి నుంచి మాటరాదని! ఇక పండగ రోజుల్లో అయితే సరేసరి.. ఇంట్లో చేసుకున్నా సరే ఆమె చేసిన వంటకాలు తింటే అదో తృప్తి అనుకునేవాళ్లూ లేకపోలేదు. ఇంట్లో అభిరుచిగా ప్రారంభించిన పిండివంటల తయారీ.. ఓ సంస్థగా మారిన వైనం ఎలాంటిదో చెబుతున్నారామె.

‘చిన్నప్పుడు ఊళ్లల్లో పండగంటే ఒకటే సందడి. వారం ముందు నుంచే పనులు మొదలయ్యేవి. మేమంతా కలిసి రోజుకొకరి ఇంట్లో పిండివంటలు చేసేవాళ్లం. అలా నాకు వాటి తయారీ అలవాటయింది. నేనేం చదువుకోలేదు. తొమ్మిదో ఏటే పెళ్లయ్యింది. ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. మావారు సత్యంరావు కాంట్రాక్టరు కావడంతో వచ్చిపోయే జనంతో ఇల్లంతా సందడిగా ఉండేది. రోజూ ఓ యాభై మందికన్నా వండి వార్చేదాన్ని. మనుమల చదువుల కోసం పాతికేళ్ల కిందట మా సొంతూరు జగిత్యాల నుంచి హైదరాబాద్‌ వచ్చేశాం.

అప్పట్లో ఇక్కడంతా కొత్త. ఏం తోచేది కాదు. ఖాళీగా ఉండే బదులు ఇంట్లో సకినాలు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. రెండుకిలోల బియ్యం, ఒక మిక్సీ ఇవే నా పెట్టుబడి. ఓ పనబ్బాయి సాయంతో నేను తయారుచేసిన సకినాలను బంధువులకు పంపించా. వాళ్లు బాగున్నాయని మెచ్చుకోవడంతోపాటు మరికొన్ని కావాలన్నారు. అలా మా బంధువులూ, తెలిసినవారి ద్వారా చాలామందికి నా పిండివంటల గురించి తెలిసింది. వాళ్ల నుంచి ఆర్డర్లు వచ్చేవి. చాలా రోజుల వరకూ మా దుకాణానికి ఓ బోర్డు, పేరు కూడా లేదు. క్రమంగా వినియోగదారులు పెరగడంతో 1998లో ‘శ్రీదేవి తెలంగాణ పిండి వంటలు’ పేరుతో దుకాణం తెరిచాం. అదిప్పుడు నాలుగు దుకాణాలకు చేరుకుంది.

కొందరు బంధువులు ‘పట్నం పోయి అప్పాలు అమ్ముకునుడేందీ?’ అనేవారు. నేను పట్టించుకోలేదు. మావారు నాకు ఎప్పుడూ ‘ఇది చేయొద్దు’ అని చెప్పలేదు. దాంతో నా అభిరుచినే వ్యాపారంగా మార్చుకున్నా. మావారు చనిపోయిన తర్వాత ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యా. మా కోడలు రేణుక, నేనూ ఇద్దరం కలిసి అన్ని పనులను చక్కగా చూసుకుంటాం’ అంటారు సావిత్రమ్మ.

వాళ్లను ఫ్లైట్‌లో తీసుకెళ్లాం..

ఆమె దగ్గర పనిచేసేవాళ్లతో ఓ యజమానిలా కాకుండా ఓ పెద్దదిక్కులా వ్యవహరిస్తారామె. అవసరమైనప్పుడు అండగా ఉంటారు. ‘ప్రస్తుతం మా దగ్గర యాభై మంది పనిచేస్తున్నారు. అందులో ఎక్కువమంది మహిళలే. వాళ్లంతా నన్ను పెద్దమ్మా అంటారు. అలా పిలిపించుకోవడం నాకిష్టం. ప్రతి ఏడాది మేమంతా విహార యాత్రకు వెళతాం. ఈ ఏడాది మొదట్లో అందరినీ విమానంలో తిరుపతి తీసుకెళ్లా. అప్పుడు చూడాలి.. వాళ్ల ఆనందం. అంతకంటే ఏం కావాలి నాకు? వాళ్లతో అంత ఆప్యాయంగా ఉంటాను కాబట్టే ఎంత పెద్ద ఆర్డరు వచ్చినా సరే... ఎవరూ శ్రమ అనుకోకుండా చకచకా పనిపూర్తి చేస్తారు.

పదేళ్ల కిందట నిజాం గ్రౌండ్స్‌లో స్టాల్‌పెట్టి తెలంగాణ పిండివంటలను పరిచయం చేశాం. అందులో గట్క, మక్క గుడాలు, బిళ్లప్పలు అమ్మాం. అప్పట్నుంచి నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి ‘మీరు సకినాల సావిత్రమ్మ కదూ. మీ పిండివంటలు చాలారుచిగా ఉంటాయి’ అంటుంటారు. అది విన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. కరోనా సమయంలో... దాదాపు డెబ్బై వేల రూపాయలు ఖరీదు చేసే పిండివంటలను పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి ఉచితంగా ఇచ్చాం. దేశంలోని ప్రముఖ నగరాలతోపాటు విదేశాలకూ పిండివంటలు పంపిస్తాం’ అంటున్నారు సావిత్రమ్మ.

కష్టాలూ ఉంటాయి..

‘వ్యాపారం తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డాం. దిల్లీలో మహానాడు నిర్వహిస్తున్నారని తెలిసి లక్షన్నర రూపాయలు విలువ చేసే పిండివంటకాలు తయారుచేశాం. అనుకోకుండా ఆ కార్యక్రమం రద్దయ్యింది. వాటిని ఏం చేయాలో పాలు పోలేదు. మరోసారి తానా, ఆటా వారి నుంచి ఆహ్వానాలు అందాయి. అప్పుడూ అంతే ఆఖరినిమిషంలో అమెరికా ప్రయాణం రద్దయ్యింది. మళ్లీ నష్టం వచ్చింది. ఇవన్నీ వ్యాపారంలో సహజమే కదా అని సర్దుకుపోతుంటా’ అనే సావిత్రమ్మ ఎవరైనా పిండివంటల తయారీ నేర్చుకుంటానంటే ఉచితంగా నేర్పిస్తానంటున్నారు.

అందుకే అంత రుచిగా..

సకినాలు, సర్వపిండి, నువ్వుల లడ్లూ, అరిసెలు, మక్కగుడాలు, మురుకులు, అప్పాలు, జొన్నరొట్టెలు.. ఇలా దాదాపు యాభైకు పైగా పిండివంటలూ, పచ్చళ్లు తయారుచేస్తారు సావిత్రమ్మ. పెళ్లిళ్లకు పెద్దఎత్తున సారె తయారుచేస్తారు. ‘రోజుకు సుమారుగా నాలుగైదు వందల కిలోల పిండివంటలు తయారుచేస్తాం. విదేశాల్లో ఉన్న తెలుగువారు, చాలామంది మంత్రులు, ఎంపీలు మా వినియోగదారుల్లో ఉన్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఎక్కడికైనా ఆర్డరు ఇవ్వాల్సి చేస్తే వెంటనే పంపిస్తాం. పండగలప్పుడయితే మా పిండివంటల కోసం జనం వరుస కడతారు. చాలామంది అడుగుతూ ఉంటారు. మీ వంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఏదైనా సీక్రెట్‌ ఉందా అని.. దీంట్లో రహస్యమేమీ లేదు. ప్రతీ పిండివంటకం తయారీకీ కడాయిలు విడివిడిగా ఉంటాయి. ఒకదాన్ని మరొకదానికి వాడం. అలాగే ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడం’ అంటారు సావిత్రమ్మ.

ఇదీచదవండి

పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.