ETV Bharat / city

కల్తీ ఆహారంతో మనిషి శరీరం ఎంత విషమయమవుతోంది? - World Health Organization latest news

ఎన్నో నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఎంతోమంది నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయినా... ఇదే తీరు. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం. వెరసి ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అసురక్షిత ఆహార పదార్థాల విషయంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. ప్రమాణాలు పాటించకుండా ఆహారపదార్థాలు తయారు చేయటం, వాటిని రోజుల పాటు నిల్వ ఉంచి విక్రయించటం లాంటి కారణాలతో శరీరం మెల్లగా విషమయమవుతోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. భారత్‌లోనూ నాణ్యత లేని ఆహారోత్పత్తుల శాతం పెరుగుతోంది.

Special article on adulterated food
Special article on adulterated food
author img

By

Published : Dec 14, 2020, 3:36 PM IST

ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య ముప్పు నుంచి ప్రజల్ని తప్పించటం అతిపెద్ద సవాలుగా మారుతుంది. పలు నివేదికలు, అధ్యయనాలు ఇలా హెచ్చరిస్తూనే ఉన్నాయి. వీటిని ఖాతరు చేయకపోవటం వల్లే ఈ సమస్యలన్నీ. వైరస్‌, బ్యాక్టీరియా, పారాసైట్స్‌ వంటివి ఆహార పానీయాల్లో చేరి క్షణాల్లో లక్షల సంఖ్యలో పెరిగిపోవడం. ఆ సమయంలో వాటిల్లోంచి కొన్ని విషపదార్థాలు వెలువడి జీర్ణవ్యవస్థను, మొత్తం అంతర వ్యవస్థను రోగగ్రస్థం చేయడం. ఇదీ దుస్థితి. ఏవైతే మనం ప్రోటీన్లు అనుకుని తింటున్నామో ఇప్పుడవే మెల్లగా శరీరాన్ని విషతుల్యం చేసి చివరకు కొత్త వ్యాధులకు కారణవుతున్నాయి. ఈ విషపదార్థాలు ముందు పేగుల మీద తమ ప్రభావం చూపుతాయి. తరవాత నుంచి సమస్యలు మొదలవుతాయి.

10 మందిలో ఒకరు

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆహార పదార్థాలు విషతుల్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షిత ఆహారం అందటం ద్వారానే ప్రజారోగ్యానికి భరోసా ఉంటుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆహారం విషతుల్యం అవుతున్న కారణంగా... ఏటా ప్రతి 10మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. అతిసార మొదలు... కేన్సర్‌ వరకు రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. అసురక్షిత ఆహారం కారణంగా మధ్యాదాయ దేశాల్లో ఏటా 110 బిలియన్ డాలర్ల మేర ఆర్థికనష్టాలు తప్పటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల ఐదేళ్ల లోపు చిన్నారుల్లో దాదాపు 40% మంది అనారోగ్యానికి గురవుతున్నారని... లక్షా 25 వేల మంది పిల్లలు మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్​ఓ నివేదిస్తోంది. కలుషిత ఆహారం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 55 కోట్ల మంది డయేరియాతో ఇబ్బందులు పడుతుండగా.. 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇలా అడ్డుకోవచ్చు

సరైన పద్ధతుల్లో ఆహారం వండితే 200 రోగాలు అడ్డుకోవచ్చన్నది డబ్ల్యూహెచ్​ఓ ప్రధానంగా చెబుతున్న మాట. కానీ... ఆహార పదార్థాల విషయంలో ఎవరూ ప్రమాణాలు పాటించటం లేదు. ఇదే విషయం గతంలో ఐక్యరాజ్యసమితి ఆహారవిభాగం కూడా ప్రస్తావించింది. ఈ సమస్య ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. పలు నివేదికలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. జాతీయ ఆహార భద్రత ప్రమాణాల మండలి-ఎఫ్​ఎస్​ఎస్​ఐఏ ఇటీవల విడుదల చేసిన నివేదికే...ఇందుకు ఉదాహరణ. అందరికీ ఆహారభద్రత మాట అటుంచి... అసలు నాణ్యమైన ఆహారం అందటమే గగనమైపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న వివిధరకాల ఆహారోత్పత్తుల్లో 28.5%.. నాణ్యతప్రమాణాలకు దూరంగా ఉన్నట్టు వెల్లడించింది.

వాటితో ప్రమాదం

ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహారపదార్థాల్లో బూజు పట్టటం సహజం. కొన్ని హోటళ్ల లో వాటిని తొలగించి ఏదో విధంగా శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. రుచికి బాగానే అనిపించినా శరీరంలోకి వెళ్లాక సమస్యలు మొదలవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార భద్రత, ప్రమాణాల విభాగం వంటి సంస్థలు గతంలో పలు ఇదే విషయమై అధ్యయనాలు చేశాయి. మనం తీసుకుంటున్న ఆహారపదార్థాల్లో ఒక కిలోకి 1 వంతు బూజు కనిపించకుండా ఉంటోందని...వాటి ద్వారా దాదాపు 15 మైక్రోగ్రాముల విష రసాయన శక్తి విడుదలవుతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. గోదాముల్లో ఆహార పదార్థాలను నిలువ చేసే సమయంలో అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల పలు ఆహారపదార్థాలకు బూజు పడుతోంది. అది కంటికి కనిపించనంత తక్కువ పరిమాణంలో నే ఉన్నప్పటికీ...ప్రజారోగ్యానికి ప్రమాదం తెచ్చి పెడుతోంది.

మళ్లీ వాడితే నష్టమే...

జాతీయ పౌష్టికాహార సంస్థ-ఎన్‌ఐఎన్‌లో ఆహార పదార్థాల రక్షణ విభాగం ఆధ్వర్యంలో దేశ నలుమూలలా నిల్వ ఉన్న ధాన్యాలతో పాటు తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారపదార్థాలపైనా పరిశోధనలు సాగుతున్నాయి. చాలా రోజుల వరకు ఆహార పదార్థాలు నిల్వ ఉంచటం వల్ల అధిక శాతం కలుషితం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాలిథిన్‌ కవర్లలో వేడివేడి ఆహార పదార్థాలు ఉంచటం వల్ల డయాక్సిన్స్‌ అనే హానికారక అంశాలు అందులోంచి విడుదల అవుతాయి. ఈ పదార్థాలు ఎక్కువగా వినియోగించే వారు కేన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉంది. తాగేనీటిని ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నింపుకోవడం వల్ల కూడా అందులోని విషపదార్థాలు విడుదలై, శరీరానికి హాని చేసే ప్రమాదం ఉంది. ఒకసారి వాడి తీసేసిన నూనెల్ని మళ్లీ వాడటం వల్ల కూడా శరీరానికి బాగా నష్టం జరుగుతోంది.

డబ్ల్యూహెచ్​ఓ సూచనలు

సురక్షిత ఆహారం తీసుకోవాలంటే ప్రజలు ఐదు సూత్రాలు పాటించాలని డబ్ల్యూహెచ్​ఓ సూచించింది. శుభ్రత, వండిన, వండని ఆహారపదార్థాలు వేరువేరుగా నిల్వ ఉంచుకోవటం, పూర్తిగా ఉడికించు కోవటం, సరైన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచటం, శుభ్రమైన నీటితో ఆహార పదార్థాలు కడగటం లాంటి చర్యలతో ముప్పు తప్పుతుందని తెలిపింది.

కల్తీ ఆహారంతో మనిషి శరీరం ఎంత విషమయమవుతోంది?

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 384 కరోనా కేసులు, 3 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.