ETV Bharat / city

Mahashivratri 2022: మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఇది మీ కోసమే! - maha shivaratri story in telugu

మహాశివరాత్రి నాడు శివ నామ స్మరణతో రోజంతా ఉపవాస దీక్షను పాటించేవారు పండ్లూ, పాలూ తీసుకోవడం మామూలే. వాటితోపాటూ ఇలాంటివీ ఏదో ఒక పూట తీసుకుంటే... పోషకాలు అందడంతోపాటూ శరీరానికి అవసరమైన శక్తీ లభిస్తుంది.

Mahashivratri
Mahashivratri
author img

By

Published : Mar 1, 2022, 6:13 AM IST

ఠండాయి

ఠండాయి

కావలసినవి: పాలు: లీటరు, చక్కెర: ముప్పావుకప్పు, కుంకుమపువ్వు రేకలు: రెండు, డ్రైఫూట్స్‌ పలుకులు: అన్నీ కలిపి రెండు చెంచాలు.

మసాలాకోసం: బాదం: పావుకప్పు, జీడిపప్పు: పావుకప్పు, పిస్తా పలుకులు: పావుకప్పు, సోంపు: రెండు టేబుల్‌స్పూన్లు, గసగసాలు: రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: ఒకటిన్నర చెంచా, దాల్చినచెక్కపొడి: కొద్దిగా, మిరియాలు: అయిదు గింజలు.

తయారీవిధానం: బాదంగింజల్ని పది నిమిషాలు నానబెట్టుకుని ఆ తరువాత పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా, సోంపు, గసగసాలు, మిరియాలు మిక్సీలో వేసుకుని పావుకప్పు కాచిన పాలు పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన పాలు పోసి, కుంకుమపువ్వు రేకలు వేయాలి. పాలు మరుగుతున్నప్పుడు చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని పాలల్లో వేసి కలుపుతూ ఉంటే... కాసేపటికి పాలు చిక్కగా అవుతాయి. అప్పుడు స్టౌని కట్టేసి అందులో యాలకులపొడి, దాల్చినచెక్కపొడి వేసి బాగా కలిపి దింపేయాలి. దీన్ని రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో పెట్టి బయటకు తీసి... గ్లాసుల్లో పోసి పైన డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని అలంకరించాలి.

ఫ్రూట్స్‌ శ్రీఖండ్‌

ఫ్రూట్స్‌ శ్రీఖండ్‌

కావలసినవి: తాజా పెరుగు: మూడు కప్పులు, చక్కెరపొడి: నాలుగు టేబుల్‌స్పూన్లు, ఆపిల్‌: ఒకటి, అరటిపండు: ఒకటి, సపోటా: ఒకటి, ద్రాక్ష: అయిదు, యాలకులపొడి: పావు చెంచా, పిస్తా పలుకులు: రెండు చెంచాలు, బాదం పలుకులు: రెండు చెంచాలు.

తయారీవిధానం: పండ్లన్నింటినీ సన్నని ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. పల్చని వస్త్రంలో పెరుగు వేసి మూటలా కట్టి... పిండినట్లు చేస్తే నీళ్లన్నీ పోతాయి. ఆ పెరుగును ఓ గిన్నెలో తీసుకుని, చక్కెర వేసి మెత్తని క్రీంలా వచ్చేలా గిలకొట్టాలి. ఆ తరువాత మిగిలిన పదార్థాలను కూడా వేసి బాగా కలపాలి. ఈ గిన్నెను రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టి..బయటకు తీస్తే చల్లచల్లని ఫ్రూట్స్‌ శ్రీఖండ్‌ సిద్ధం.

డ్రైఫ్రూట్స్‌ చాట్‌

డ్రైఫ్రూట్స్‌ చాట్‌

కావలసినవి: బాదం: పదిహేను, జీడిపప్పు: పదిహేను, పిస్తా పలుకులు: ఇరవై, కిస్‌మిస్‌: అరకప్పు, ఖర్జూరాలు: నాలుగు, వాల్‌నట్స్‌: ఎనిమిది, ఫూల్‌మఖానీ: పావుకప్పు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, చాట్‌మసాలా: రెండు చెంచాలు, గరంమసాలా: చెంచా, నిమ్మకాయ: ఒకటి, ఉప్పు: తగినంత, జీలకర్రపొడి: చెంచా, పనీర్‌ముక్కలు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు.

తయారీవిధానం: జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లను విడివిడిగా రెండుగంటలసేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీటిని వంపేసి బాదం పొట్టు తీసుకోవాలి. మిగిలిన డ్రైఫ్రూట్స్‌ను ముక్కల్లా కోసుకోవాలి. ఫూల్‌మఖానీని నూనె లేకుండా దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి సగం నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ పలుకులన్నింటినీ వేసుకుని దోరగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి పనీర్‌ ముక్కల్ని కూడా వేయించి విడిగా తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వాటన్నింటినీ గిన్నెలో వేసి... ఆపైన మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ బాగా కలిపితే సరి.

పైనాపిల్‌-సాగో ఖీర్‌

పైనాపిల్‌-సాగో ఖీర్‌

కావలసినవి: సగ్గుబియ్యం: కప్పు, పైనాపిల్‌ ముక్కలు: కప్పు, పాలు: అరలీటరు, చక్కెర: ముప్పావుకప్పు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: కొన్ని, నెయ్యి: చెంచా.

తయారీవిధానం: సగ్గుబియ్యాన్ని అరగంటసేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత కడిగి రెండుకప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించుకుని తీసుకోవాలి. పైనాపిల్‌ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి పైనాపిల్‌ మిశ్రమాన్ని వేసి అయిదు నిమిషాలు ఉడికించుకుని అందులో అరకప్పు చక్కెర, కాసిని పాలు పోయాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు అడుగు అంటకుండా కలిపి దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద మళ్లీ కడాయి పెట్టి మిగిలిన పాలు పోసి సగ్గుబియ్యం, మిగిలిన చక్కెర వేసి బాగా కలపాలి. పాయసం చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక పైనాపిల్‌ మిశ్రమం వేసి మరోసారి కలపాలి. నేతిలో డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని వేయించి పాయసం మీద వేస్తే నోరూరించే పాయసం రెడీ.

ఇదీ చూడండి :

sri sailam:బ్రహ్మోత్సవం.. శ్రీశైల మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.