ETV Bharat / city

ఈ పోషకాలను తాగేయండీ.. రోజంతా ఉత్సాహంగా ఉండండి..!

కరోనా దెబ్బతో అందరూ ఆరోగ్యం మీద కాసింత ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైన ఆహారం ఉంటుందా లేదా అనేది ముఖ్యం. సిరి ధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే గుణాలేంటి? దీంతో ఎలాంటి ఆహారం తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

author img

By

Published : Sep 18, 2022, 2:10 PM IST

nutrition drink
రాగిమాల్ట్‌

కొవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఏం తింటున్నాం అనే దానికన్నా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అనేది ముఖ్యం. చాలా తక్కువ ధరకు దొరికే సిరి ధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంతకీ అందులో గుణాలేంటి? దాంతో ఎలాంటి ఆహారం తయారు చేసుకవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాలను తాగేయండీ.. చాలామందికి ఉదయం టీ, కాఫీ ఏదోటి తాగనిది రోజు మొదలవ్వదు. కానీ వీటికి బదులుగా ఆరోగ్యకరమైన డ్రింక్‌ను డైలీ రొటీన్‌లో చేర్చితే ఎలా ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా! అందరికీ అందుబాటులో ఉండే రాగిమాల్ట్‌. ఉదయం పూట ఒక గ్లాసు రాగిమాల్ట్‌ తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

రాగి ఇడ్లీలు: ఎప్పడు ఒకే విధంగా ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి! కాస్త భిన్నంగా మరింత ఆరోగ్యంగా రాగి పిండితో ఇడ్లీలు చేసుకోండి. దీంతో ఇంటిల్లి పాదికి లాభం చేకూరుతుంది.

రాగి సంగటి: తెలుగు రాష్ట్రాల్లో రాగి సంగటి ఎంతో ఫేమస్‌. దీన్ని ఉదయం అల్పాహారంగా అయినా, మధ్యాహ్నం భోజనంగా అయినా తినవచ్చు.

* రాగి పిండితో దోశలు, లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఎవరి నచ్చిన తీరులో వాళ్లు దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. పోషకాలను పొందవచ్చు.

రాగి వల్ల లాభాలు: కాల్షియం, ప్రొటీన్‌లు పుష్కలంగా ఉండే వాటిల్లో రాగి ఒకటి. వంద గ్రాముల రాగుల్లో 344మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఒక కప్పు రాగి పిండిలో 10 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.

* ఒక కప్పు రాగి పిండిలో 16.1 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇది బరువుని నియంత్రించేందుకు చక్కగా పని చేస్తుంది. బరువు విషయంలో జాగ్రత్తలు పాటించేవారు రాగిని తరచూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

* ఇందులో ఐరన్‌ ఎముకలకు బలాన్ని అందిస్తుంది.

* మనం తీసుకునే ఆహారం మన మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల రాగిలో యాంటీఆక్సిడెంట్లు ఆందోళనలకు, డిప్రెషన్‌కి గురి కాకుండా తోడ్పడుతాయి.

* ఆరోగ్యానికి మాత్రమే కాదు. అందానికి కూడా రాగి నేస్తమే అని చెప్పాలి. ఇందులో ఉండే విటమిన్‌ బి3 చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. వేలకు వేలు పెట్టి ఆరోగ్యం కాపాడుకునేందుకు వెచ్చించేందుకు బదులు మన వంటింట్లో ఉండే వాటిని ఉపయోగించుకుంటే ఎంతో మేలు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.