ETV Bharat / city

disha bill: దిశ బిల్లులపై ఉత్తర, ప్రత్త్యుత్తరాలతోనే కాలయాపన !

'దిశ' బిల్లులు రాష్ట్రంలోని ఉభయసభల్లో ఆమోదం పొంది ఏడాదిన్నర దాటినా.. చట్టంగా మారి అమలులోకి రాలేదు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తున్నా... సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ సమగ్ర వివరాల కోసం కేంద్రం తిప్పి పంపిస్తోంది. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు వెల్లడించిన అభిప్రాయాలు, అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించి తాజాగా కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి పంపించింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానాల్ని సిద్ధం చేసింది. ఈసారైనా కేంద్రం సంతృప్తి చెందితేనే బిల్లులు ఆమోదానికి నోచుకుంటాయి.

Legalization of Disha bills
ఏడాదిన్నర దాటినా దిశ బిల్లులకు దక్కని చట్టబద్ధత
author img

By

Published : Sep 16, 2021, 4:24 AM IST

మహిళలు, బాలలపై జరిగే క్రూరమైన, లైంగిక నేరాల్లో సత్వర దర్యాప్తు, వేగవంతమైన న్యాయవిచారణ, కఠిన శిక్షలకు వీలుగా ప్రభుత్వం తెచ్చిన 'దిశ' బిల్లులు చట్టబద్ధతను పొందలేకపోతున్నాయి. ఈ బిల్లుల్లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌-1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌-1973కు సవరణలు చేసినందున చట్టరూపం దాల్చాలంటే రాష్టపతి ఆమోదం తప్పనిసరి. ఈ ప్రక్రియలో భాగంగా బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించగా సంబంధిత మంత్రిత్వశాఖలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ సమగ్ర వివరణలు కోరుతూ కేంద్రం వాటిని తిప్పి పంపిస్తోంది. ఏడాదిన్నరగా ఇదే తంతు నడుస్తోంది. తాజాగా బిల్లులపై అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. వాటికి రాష్ట్రప్రభుత్వం సమాధానాల్ని సిద్ధం చేసింది. ఈ సారైనా కేంద్రం సంతృప్తి చెందితే బిల్లులకు చట్టబద్ధత దక్కుతుంది.

శాస్త్రీయ ఆధారాల సేకరణ సాధ్యమా
దిశ బిల్లులపై కేంద్రం పలు కీలక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లైంగిక నేరగాళ్ల జాబితాను రూపొందించి డిజిటలైజ్‌ చేస్తామని బిల్లులో ఉంది. ఆ వివరాలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది. నేరస్థులవి కాకుండా నిందితులందరి వివరాలు ఎందుకని కేంద్రం ప్రశ్నించింది. ఒక ఘటన జరిగిందని బాధితుల పేరుతో చట్టాలు తేవడం ప్రారంభిస్తే.. ఐపీసీ మొత్తం పేర్లతోనే నిండిపోతుంది కదా అని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరం జరిగిన వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి, ఛార్జిషీట్ వేయాలంటే అంత తక్కువ వ్యవధిలో శాస్త్రీయ ఆధారాల సేకరణ సాధ్యమా అని కేంద్రం అడిగింది. న్యాయనిరూపణ సరిగ్గా జరగక.. దోషి తప్పించుకోవచ్చు లేదా హడావుడి దర్యాప్తు వల్ల నిర్దోషులు ఇరుక్కోవచ్చు కదా? అని ప్రశ్నించింది. అలాగే ఐపీసీ(ipc)లో అదనంగా సెక్షన్లు జోడించడం, ఇప్పుడున్న సెక్షన్లలోని శిక్షల్ని పెంచడం ఎలా సాధ్యమని.. అవసరమైతే రాష్ట్ర స్థానిక చట్టాలు చేసుకోవచ్చు కదా అని కేంద్రం ప్రశ్నించింది.

వాటికి రాష్ట్రపతి ఆమోదం అవసరం
2019 నవంబర్‌ 28న హైదరాబాద్‌ శివారులో దిశ హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లులు రూపొందించింది. ఈ తరహా నేరాల్లో 7 రోజుల్లో పోలీసుల దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయవిచారణ, 21 రోజుల్లో శిక్ష వేయించడం, ఈ కేసుల సత్వర న్యాయవిచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ బిల్లులు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు- క్రిమినల్‌ లా ( ఏపీ సవరణ ) బిల్లు- 2019, ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019 పేరిట రెండు బిల్లులు రాష్ట్ర ఉభయసభల్లో 2019 డిసెంబర్‌ 16 నాటికి ఆమోదం పొందాయి. క్రిమినల్‌ లా, క్రిమినల్‌ ప్రొసీజర్స్‌, న్యాయ పరిపాలన అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నందున వీటి చట్టబద్ధతకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం అవసరం.

తప్పులున్నాయంటూ బిల్లులను వెనక్కి
కేంద్ర హోంశాఖ ఈ బిల్లులపై సంబంధిత మంత్రిత్వ శాఖల అభిప్రాయాల్ని కోరింది. వారు తెలిపిన అభ్యంతరాలు, కొర్రీలన్నింటినీ క్రోడీకరించి.. రెండో బిల్లులో పేర్కొన్న ‘లైంగిక నేరగాళ్ల జాబితా ప్రదర్శన’పై అభ్యంతరం చెప్పింది. ‘ఆంధ్రప్రదేశ్‌’, ‘ప్రత్యేక న్యాయస్థానాలు’పదాలు రెండుసార్లు ఉన్నాయని.. మరికొన్ని తప్పులున్నాయంటూ బిల్లులను వెనక్కి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండో బిల్లును పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు 2020 డిసెంబరు 2న అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత ప్రకటించారు. ఆ స్థానంలో 2020 డిసెంబరు 3న ‘‘ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు) బిల్లు-2020’’ ను ప్రవేశపెట్టారు. తుదిగా దీన్నే కేంద్రానికి పంపించారు.. Spot

రాష్ట్రం నుంచి ఇంకా వివరణలు అందలేదు..
బిల్లులపై తమ అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం రెండుసార్లు వివరణలు ఇచ్చిందని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. రెండోసారి ఇచ్చిన వివరణపై తమ అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ ద్వారా ఏపీకి తెలియజేశామన్నారు. దిశ బిల్లులపై సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు తెలిపిన అభిప్రాయాలపై వివరణలు, సమాధానాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా తెలిపారు. రాష్ట్రం నుంచి ఇంకా తమకు వివరణలు అందలేదన్నారు. దిశ బిల్లులను కేంద్రానికి పంపామని.. వారు చాలా కొర్రీలు వేస్తున్నారని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు. ఆ పదం ఎందుకు పెట్టారు? ఇంత శిక్షలెందుకు? అని అడుగుతున్నారని చెప్పారు. కీలక అంశాల గురించి కాకుండా.. పరిమాణం, పరిభాషను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అన్నింటికీ సమాధానాలిస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి..

TTD BOARD: 24 మందితో తితిదే నూతన పాలక మండలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.