అత్యవసర కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక అవుట్ పేషెంట్ విభాగం ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. సి-19 పేరిట ఓ ప్రత్యేక అవుట్ పేషెంట్ గదిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వీటి కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రత్యేక ఓపీ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. వైద్యులు, ఆరోగ్య నిపుణులు, ఇతర పేషంట్లకు కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని... ఓపీలో పనిచేసే వారు తప్పనిసరిగా పీపీఈలు, ఎన్ 95 మాస్కులు ధరించి రోగులను పరీక్షించాలని సూచించింది. కరోనా లక్షణాలతో వచ్చినవారిని క్యాజువాలిటీ వార్డుల్లో చేరకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
ఇదీ చదవండి : ఆదోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం