ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రజల్లో అసంతృప్తి బాగా ఉందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రంగుమారిన ధాన్యాన్ని కొనాలని ఈ విషయంపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో గుర్తుచేశారు. రవాణా ఛార్జీలు రైతుల ఖాతాల్లో పడడం లేదన్న ఆయన.. పొరపాటు ఎక్కడ జరుగుతుందో సరి చేయాలని అధికారులను ఆదేశించారు. నెలాఖరు నాటికి జిల్లాలో వంద శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: CS Sameer Sharma: కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎస్ భేటీ వాయిదా