ETV Bharat / city

ఎస్పీ బాలు మృతి పట్ల ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం సంతాపం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం తెలిపారు.

ఎస్పీ బాలు
ఎస్పీ బాలు
author img

By

Published : Sep 25, 2020, 2:08 PM IST

Updated : Sep 25, 2020, 4:13 PM IST

  • ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది.#SPBalasubrahmanyam pic.twitter.com/j6cHkIRESO

    — Vice President of India (@VPSecretariat) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎస్పీ బాలు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరమన్నారు. బాలు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బాలు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

గవర్నర్ సంతాపం

ఎస్‌.పి.బాలు మృతి పట్ల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతాపం తెలిపారు. ప్రజల హృదయాల్లో బాలు చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

  • Hon'ble Governor Sri Biswa Bhusan Harichandan expressed profound grief & sadness at the demise of popular playback singer Sri #SPbalasubramanyam. Governor prayed for peace to the departed soul and offered his heartfelt condolences to members of the bereaved family. pic.twitter.com/iz47nWKFYs

    — Governor of Andhra Pradesh (@governorap) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం సంతాపం

గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలు(74) ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎస్పీ బాలు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం చెప్పారు. ఎస్పీబీగా ప్రసిద్ధి చెందిన బాలు ఇక లేరన్న వార్త ఆవేదన కలిగించిందని సీఎం అన్నారు. తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి సామాన్యులను సైతం ఆకర్షించారన్నారు.

  • గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.#RIPSPB

    — YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రబాబు సంతాపం

ఎస్పీ బాలు మృతికి తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి చెప్పారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదని, రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉందని చంద్రబాబు ఆవేదన చెందారు. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసిందన్నారు. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు అన్నారు.

  • కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు.(1/2) pic.twitter.com/QPdvN7BaEf

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలు లేరన్న వార్త కలిచివేసింది : పవన్

ఎస్పీ బాలు మరణ వార్త కలిచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాలు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తన సినిమాలకు ఎస్పీ బాలు గళం అందించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆయన మన మధ్యలేకపోవడం బాధాకరమన్నారు.

పవన్ కల్యాణ్

చిరకాలం జీవించే ఉంటాయి: లోకేశ్

ఎస్పీ బాలు మృతిపట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పాట, మాట, బాట, నటన, సంగీతం అన్నీ చిరకాలం జీవించే ఉంటాయని అన్నారు.

  • ఆబాల గోపాలాన్ని త‌న గానంతో అల‌రించిన ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారు క‌న్నుమూయ‌డం.. సంగీత‌, సాహిత్య, సినీ, క‌ళా ప్ర‌పంచానికి తీర‌నిలోటు. ద‌శాబ్దాలుగా భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ 40 వేల‌కు పైగా పాట‌లు పాడిన సుస్వ‌రాల సుమ‌ధుర బాలు మ‌న‌మ‌ధ్య‌ లేక‌పోవ‌చ్చు.(1/2) pic.twitter.com/R3wlpaAmfg

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విలువైన ఆస్తిని కోల్పోయాం : సోము వీర్రాజు

  • గాన గంధర్వుని మరణవార్త సంగీత ప్రియుల గుండెల్లో అత్యంత విషాదాన్ని మిగిల్చింది. భారతీయ సంగీత సామ్రాజ్యం నేడు ఓ విలువైన ఆస్తిని కోల్పోయింది.

    ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి మరణం పట్ల చింతిస్తూ... శోకతప్త హృదయంతో వారికి అశ్రునివాళి గటిస్తున్నాను.#ఓంశాంతి 🙏#SPBalasubrahmanyam pic.twitter.com/VBjMX63JKO

    — Somu Veerraju (@somuveerraju) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎస్పీ బాలుకి కన్నీటి వీడ్కోలు : జనసేన

ఇదీ చదవండి : దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం

Last Updated : Sep 25, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.