రాయలసీమ ప్రజలకు భాజపా నేత సోము వీర్రాజు క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసే క్రమంలో... రాయలసీమ ప్రజల మనసులు గాయపడ్డాయన్నారు. రాయలసీమ రతనాలసీమ అని.. ఈ పదం తన హృదయంలో పదిలంగా ఉంటుందన్నారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని.. అదే భాజపా ఆలోచన అని సోము వీర్రాజు ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:Somu Veerraju Controversy Statements: సోమువీ'ర్రాజు'కున్న మాటల మంటలు...