భాజపా మహిళా నాయకురాలు సాధినేని యామినిపై కేసు నమోదు చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తప్పుబట్టారు. యామినిపై నమోదు చేసిన కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయోధ్య కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకపోవటంపై ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే బాధ కలుగుతోందని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. యామినితో పాటు భాజపాలో చాలా మంది ఈ అంశంపై మాట్లాడారని తెలిపారు. అయోధ్యలో రామమందిరం కొన్ని శతాబ్దాల కల అనీ.. రామ మందిర శంకుస్థాపనను ప్రపంచ వ్యాప్తంగా 250 ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని గుర్తు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
అయోధ్యలో రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రచారం చేయకపోవటాన్ని భాజపా నేత యామిని విమర్శించారు. యామిని విమర్శలు తితిదే ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని ఫిర్యాదు చేయటంతో.. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయి: తెదేపా