ETV Bharat / city

'రెఫరెండం ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని రాజధానిని మార్చండి' - అమరావతిపై సోమిరెడ్డి వ్యాఖ్యలు

నాడు శాసనసభలో అన్ని పార్టీలు మద్దతిచ్చిన అమరావతిని నేడు మార్చడం అన్యాయమని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రెఫరెండం ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని రాజధానిని మార్చుకోవాలన్నారు.

somireddy chandramohan reddy about amaravathi
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
author img

By

Published : Aug 1, 2020, 2:38 PM IST

రాజధానిని మార్చడం, 3 రాజధానులు పెట్టుకోవడం వంటి విషయాలు వైకాపా ఇష్టమని భాజపా మాట్లాడడం బాధాకరమని తెదేపా పొలిట్​బ్యారో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్రజలు ఆవేదనతో కృంగిపోతూ ఇబ్బందులు పడుతుంటే ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.

నిండు శాసనసభలో అమరావతికి ఆనాడు వైకాపా, భాజపాలు మద్దతు తెలిపాయని గుర్తుచేశారు. రూ. 10వేల కోట్ల ఖర్చు జరిగిన అమరావతిని అర్ధంతరంగా మార్చేస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రెఫరెండం ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని రాజధానిని మార్చుకోవాలన్నారు.

'మీకు ధైర్యం ఉంటే ప్రజాభిప్రాయం తీసుకుని రాజధానిని మార్చుకోండి. అంతేకానీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. నాడు శాసనసభలో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి. స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ నమ్మకంతోనే రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారు. మీరు ఇవాళ విశాఖకు రాజధాని మారిస్తే వాళ్లంతా ఏం కావాలి?' -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా నేత

ఇవీ చదవండి..

మూడు రాజధానుల అంశంపై రెఫరెండెం తీసుకోవాలి: ఎంపీ రాఘురామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.