ETV Bharat / city

ఆ కళాశాల అంతా సౌర వెలుగుల సౌరభం - solar-power-projecr-success-in-kbn-college-vijyawada

పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం అత్యావశ్యకం. ఈ నినాదాన్ని ఆదర్శంగా తీసుకున్న ఓ కళాశాల.. వినియోగానికి ఆవసరమైన సౌరవిద్యుత్‌ని తమంతట తామే ఉత్పత్తి చేసుకుంటుంది. ఏటా సుమారు 12 లక్షల మేర విద్యుత్‌ బిల్లుని ఆదా చేస్తూ.. సహజ వనరుల వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది.

ఆ కళాశాల అంతా సౌర వెలుగుల సౌరభం
author img

By

Published : Sep 2, 2019, 4:26 AM IST

విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల వినూత్న ఆలోచన అందరిలోనూ స్ఫూర్తిని నింపుతోంది. ఈ కళాశాలలో ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యాబోధన అందుబాటులో ఉంది. అన్ని విభాగాల్లో కలిపి సుమారు ఐదు వేల మందికిపైగా చదువుకుంటున్నారు. తరగతి గదులతో పాటు అధ్యాపకులు, సిబ్బందింకి కేటాయించిన గదులు, క్యాంటీన్, ప్రయోగశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ వినియోగం తప్పనిసరి. ఫలితంగా భారీ మొత్తంలో కరెంట్ బిల్లు చెల్లించాల్సి వచ్చేది. ఇక్కడే.. కళాశాల యాజమాన్యం సరికొత్త ఆలోచనలకు ఆజ్యం పోసింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని భావించిన యాజమాన్యం..సహజ వనరులపై దృష్టి సారించింది. అంతేకాదు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ఔరా అనిపించింది.
కళాశాలలో విద్యుత్ వినియోగం తగ్గించాలన్న నిర్ణయంతో ... సౌరవిద్యుత్‌ పై ఆసక్తితో ఓ ప్రైవేట్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. విశాలంగా ఉన్న 3 అంతస్తుల భవనంపై సౌరఫలకలను ఏర్పాటు చేసింది. వ్యయంలో నాబార్డు కొంత మేర రాయితీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కళాశాలలో సౌర ఫలకాల ద్వారా 150 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. దానిని పవర్‌ గ్రిడ్‌కు పంపిస్తున్నారు. యూనిట్‌కు నాలుగు రూపాయల 5 పైసలు చొప్పున కళాశాల... ప్రైవేటు సంస్థకు చెల్లిస్తోంది. సుమారు 12 లక్షల మేర వ్యయాన్ని పొదుపు చేసుకుంటుంది.

ఆ కళాశాల అంతా సౌర వెలుగుల సౌరభం
ఇతర కళాశాలలు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తే వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు... కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని కళాశాల ప్రిన్సిపాల్‌ నారాయణ రావు చెబుతున్నారు.

Intro:సత్యసాయి మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు ఆదివారం సత్య సాయి జనరల్ ఆస్పత్రిలో వైద్యులు మెరుగైన సేవలు అందించేందుకు సత్యసాయి ట్రస్టు నూతనంగా నిర్మించిన విభాగాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకున్నా సేవలను మానవాళికి అందించి భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలపై ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని అందులో జరిగే సమీక్షలో సత్యసాయి వైద్య సేవలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు తరువాత సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు సత్యసాయి సేవా కార్యక్రమాలపై సత్యసాయి మహా సమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు సత్యసాయి సేవా కార్యక్రమాలపై ట్రస్టు సభ్యులు చర్చించారు

Body:సత్య సాయి జనరల్ ఆస్పత్రిలో విభాగాన్ని ప్రారంభించిన ఎల్ వి సుబ్రహ్మణ్యం

Conclusion:సత్య సాయి జనరల్ హాస్పిటల్ లో నూతన విభాగాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.