తెలంగాణ కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం ఇసన్నపల్లి గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలోకి నాగుపాము దూరింది. భయాందోళనకు గురైన యాజమాని.. స్థానికంగా పాములు పట్టడంలో సిద్ధహస్తుడైన ఓ వ్యక్తికి సమాచారమిచ్చాడు.
కర్ర సాయంతో పామును పట్టుకున్న ముత్తయ్య.. దాన్ని తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సర్పాలు కనిపిస్తే వాటిని చంపవద్దని.. తమకు తెలియజేయాలని ఆయన స్థానికులకు సూచించారు.
ఇదీ చదవండి: నాంపల్లిలో అగ్ని ప్రమాదం.. దుకాణాలు దగ్ధం