ETV Bharat / city

Kamareddy Accident: లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం - road accident in kamareddy

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 18, 2021, 2:07 PM IST

Updated : Dec 18, 2021, 7:15 PM IST

14:06 December 18

ROAD ACCI BREAKING

లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం

Kamareddy Accident: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టగా.. ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పెద్దకొడప్గల్‌ మండలం జగన్నాథ్‌పల్లి గేట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళ్తున్న కారు.. అతివేగంగా వచ్చి ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌ ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలాడు. మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.. క్షతగాత్రులను స్థానికులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కారు బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారు వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్లు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ద్వారా వివరాల సేకరిస్తున్నారు.

ఈ ప్రమాదం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం పట్ల బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కాసేపట్లో పెళ్లి.. వరుడ్ని చితకబాదిన వధువు కుటుంబం

Last Updated : Dec 18, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.