రాష్ట్రంలో సోమవారం నుంచి ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. జూనియర్ కళాశాలలు మే 31వరకు 106 రోజులు పనిచేయనున్నాయి. వేసవి సెలవులు, రెండో శనివారం సెలవులను రద్దు చేశారు. సోమవారం నుంచి పదో తరగతికి ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20 వరకు బోధిస్తారు.
పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు జిల్లాల వారీగా జిల్లా విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పండుగల సెలవులు మినహా ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:
స్టడీ మెటీరియల్ కోసం వెతికే పని లేదు.. ఒక్క క్లిక్‌తో మీ చెంతకే..