రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి లంక భూముల్లో గత ప్రభుత్వంలో మాజీ మంత్రులు భారీగా కొనుగోలు చేశారనే ఆరోపణలపై సిట్ ఆరా తీసినట్లు సమాచారం. తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో రాయపూడి లంక భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై విచారణ జరిపారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన అనంతరం జరిగిన క్రయవిక్రయాలతోపాటు... ఎవరెవరి పేరుతో ఎంత భూములున్నాయన్నదానిపై రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది.
రాజధాని భూముల్లో అక్రమాల ఆరోపణలపై సిట్ విచారణ వేగవంతం - అమరావతి భూముల వార్తలు
రాజధాని భూముల్లో అక్రమాల ఆరోపణలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాక జరిగిన క్రయవిక్రయాల వివరాలతో పాటు పలు వివరాలను సేకరించినట్లు సమాచారం.