SI Conversation: ఇసుక మాఫియాకు పోలీసుల అండదండలు ఉంటున్నాయి. ఇసుక రిచ్ల వద్ద కాపలా ఉండే కానిస్టేబుళ్లకు డబ్బులు ఇస్తే చాలు, ఇసుకను తోలుకోవచ్చును. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో జరిగింది. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలంలో ఉన్న ఇసుక రిచ్ వద్ద ఎస్సై ఆధ్వర్యంలోని సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాత్రి వేళలో 20 ట్రిప్పుల ఇసుకను తరలించేందుకు ఎస్సైతో బేరం కుదుర్చుకున్నాడు. అక్కడ ఉన్న పోలీసులకి రెండు వేలు ఇవ్వాలని చరవాణిలో సంప్రదింపులు జరిపారు. ఇప్పుడా సంభాషణ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆడియో రికార్డ్ ఎస్సైదే అని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు పరిశీలించి అది వాస్తవం అయితే కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Lokesh on HC Verdict: వైకాపా మూడు ముక్కలాటకు చెంపపెట్టు హైకోర్టు తీర్పు - నారా లోకేశ్