హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి అభిషేక్ నందన్ ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమిపై 1164 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎం.శ్రీచరణ్, ప్రధాన కార్యదర్శిగా గోపిస్వామి, సంయుక్త కార్యదర్శిగా రాథోడ్ ప్రదీప్, క్రీడా కార్యదర్శిగా సోహైల్ అహ్మద్, సాంస్కృతిక కార్యదర్శిగా ప్రియాంక గెలుపొందారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్యూ, డీఎస్‌యూ, టీఎస్ఎఫ్ కూటమిగా పోటీ చేయగా... ఏబీవీపీ, ఓబీసీఎఫ్, ఎస్ఎల్వీడీ మరో కూటమిగా బరిలో నిలిచాయి.
ఇదీ చూడండి: 'తెలంగాణ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ