Rains Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తీవ్ర వాయుగుండం తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటలుగా 13 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. సాయంత్రానికి తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, కోస్తాంధ్రలో తీరంవెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
ఇదీ చదవండి : Balaji Temple At kovvada: పట్టుపట్టారు.. గుడి కట్టారు