రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల(heavy rainfall in andhra pradesh) కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు(trains cancelled today) చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో 172 రైళ్లను పూర్తిగా రద్దు(trains cancelled today) చేసింది. 29 రైళ్లను పాక్షికంగా(trains temporarily cancelled), 108 రైళ్లను దారి మళ్లించినట్టు(Diversion of Trains) దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీటితో పాటు 5 రైళ్లను రీ-షెడ్యూలింగ్ చేశామని.. రెండు రైళ్లను షార్ట్ టర్మినేషన్ చేశామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా గుంతకల్ డివిజన్లోని నందలూరు- రాజంపేట్ సెక్షన్, రేణిగుంట- పూడి సెక్షన్, తనకల్ల- ములకలచెరువు, ధర్మవరం- పాకాల సెక్షన్లతో పాటు విజయవాడ డివిజన్లోని నెల్లూరు- పడుగుపాడు సెక్షన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని రైల్వే శాఖ తెలిపింది.
రద్దైన రైలు సర్వీసులు..
చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్, కాచిగూడ- చెంగల్పట్టు, చెన్నై సెంట్రల్- ఎల్టీటీ ముంబయి, చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్, మధురై- ఎల్టీటీ ముంబయి, రేణిగుంట-గుంతకల్, తిరుపతి- చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్- తిరుపతి, గుంతకల్- తిరుపతి, చెన్నై సెంట్రల్- విజయవాడ, చెన్నై సెంట్రల్ -హైదరాబాద్, గూడూరు- విజయవాడ, నర్సాపూర్- ధర్మవరం, కాకినాడ టౌన్- కేఎస్ఆర్ బెంగళూరు, గూడూరు- సికింద్రాబాద్, లింగంపల్లి- తిరుపతి, హైదరాబాద్- తంబరం, సికింద్రాబాద్- గూడూరు, తిరుపతి- కరీంనగర్, చెన్నై- ఎగ్మూర్- జోధ్పూర్, చెంగల్ పట్టు- కాకినాడ పోర్ట్, చెన్నై సెంట్రల్- బిత్రగుంట, చెన్నై సెంట్రల్- చప్ర, చెన్నై సెంట్రల్- న్యూదిల్లీ, చెన్నై సెంట్రల్- హౌరా, కోబ్రా- కోచువెల్లి, కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ- కాకినాడ టౌన్, తిరుపతి - నిజామాబాద్, తిరుపతి- కొల్లాపూర్, కడప- విశాఖపట్నం, చిత్తూరు- కాచిగూడ, హౌరా- యశ్వంత్పూర్, వాస్కోడిగామా- హౌరా, కాచిగూడ- వాస్కోడిగామా, ఎర్నాకులం- హెచ్ నిజాముద్దీన్, రేణిగుంట- కాకినాడ పోర్ట్, మధురై- హెచ్నిజాముద్దీన్, టాటా- ఎర్నాకులం, త్రివేండ్రం- సికింద్రాబాద్, నాగర్సోల్-ముంబయి సీఎస్ఎంటీ, తిరుపతి- భువనేశ్వర్, తిరుపతి- బిలాస్పూర్, విశాఖపట్నం- కడప, చిత్తూరు- కాచిగూడ, కాకినాడ టౌన్- బెంగళూరు, ఆదిలాబాద్- హెచ్ఎస్ నాందేడ్, రామేశ్వరం- భువనేశ్వర్ తదితర రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
ఇవీ చూడండి: