ETV Bharat / city

aided bill:నిర్ణయం వెనక్కి తీసుకున్నాక మళ్లీ బిల్లు ఎందుకు?: ఎమ్మెల్సీలు

author img

By

Published : Nov 25, 2021, 7:46 AM IST

ఎయిడెడ్ విద్యా సంస్థలను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకోకుండా వాటి సాయం నిలిపివేతకు తెచ్చిన సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు దీనిపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని ఉపాధ్యాయ, స్వతంత్ర, భాజపా ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలిలో జరిగిన చర్చలో పలువురు ఎమ్మెల్సీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

aided bil
aided bil

ఎయిడెడ్‌ విద్యా సంస్థలను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకోకుండా వాటికి సాయం నిలిపివేతకు తెచ్చిన సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని దీనిపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని ఉపాధ్యాయ, స్వతంత్ర, భాజపా ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. మండలిలో బుధవారం ఎయిడెడ్‌ విద్యా సంస్థల సవరణ బిల్లును మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ఎమ్మెల్సీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే బిల్లుకు మండలిలో ఆమోదం లభించింది.

* ‘దేశవ్యాప్తంగా ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 2.70 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిపై ఏం చేయాలనేది ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకొనుంటే బాగుండేది. తొలుత రెండు, తర్వాత మరో రెండు ఆప్షన్లు ఇచ్చారు. ప్రభుత్వానికి తల బొప్పికట్టింది. ఎయిడెడ్‌ వదులుకున్న యాజమాన్యాల చేతుల్లోనే విద్యాసంస్థలను పెడుతున్నారు. ఇలాంటి అర్థరహితమైన బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ విద్యా సంస్థలను పరిపుష్ఠం చేయడంగానీ, నిర్ణయంపై పునఃసమీక్షగానీ చేయాలి’ అని విఠపు బాలసుబ్రమణ్యం డిమాండ్‌ చేశారు.

* ‘ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ఎయిడెడ్‌ సంస్థలను మూసేస్తే, వాటిలో చదివే విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎందుకు దృష్టిపెట్టలేదు?’ అని లక్ష్మణరావు ప్రశ్నించారు.

* ‘విశాఖలోని జింక్‌ పాఠశాల 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో చదువుతున్న విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలి. మానవతా దృక్పథంతో బిల్లు ఉపసంహరించుకోవాలి’ అని రఘువర్మ కోరారు.

* ‘వ్యవస్థలో లోపాలుంటే సవరించాలి. ఎయిడెడ్‌ వ్యవస్థను పునరుద్ధరించాలి. ఈ బిల్లుపై పునఃసమీక్షించాలి’ అని భాజపా పక్షనేత మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసమే: మంత్రి కన్నబాబు

ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సవరణ బిల్లు తీసుకొచ్చినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ‘1990 తర్వాత కొత్తగా ఒక్క ఎయిడెడ్‌ సంస్థ కూడా ఏర్పడలేదు. లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, తప్పుబట్టడం సరికాదు. నడపలేమని విద్యా సంస్థలు మూసేసినచోట్ల కొత్త విద్యా సంస్థల ఏర్పాటుకు సన్నద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. అనంతరం బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది.

ప్రైవేటు వర్శిటీల్లో 35% కన్వీనర్‌ కోటా

ప్రభుత్వం నుంచి చౌకగా భూములు తీసుకున్న ప్రైవేటు వర్శిటీల్లో రిజర్వేషన్లు పాటించడంలేదని, స్థానికంగా ఉండేవారికి వీటిలో సీట్లు కేటాయించడం లేదని, అందుకే వీటిలో 35% సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీచేసేలా సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 5 వేల పోస్టులు ఖాళీగా ఉండటంతో, అవి క్షీణించిపోతున్నాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. వీటిలో 2 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి బదులిచ్చారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై పర్యవేక్షణ, ఫీజుల నిర్ణయం తదితరాలకు.. వీటిని ఏపీ ఉన్నతవిద్య రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ కిందకు తీసుకొచ్చేలా మరో బిల్లు తెచ్చామని కన్నబాబు వివరించారు. డీమ్డ్‌ యూనివర్శిటీలు యూజీసీ కింద ఉన్నాయని, వీటిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: CM Review: వరద బాధిత కుటుంబాలకు పూర్తి సాయం: సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.