'వర్ధన్‌కు విధి వెక్కిరింత' అనే ఈటీవీ-ఏపీ, 'అచేతనంగా కన్నబిడ్డ.. కంటికి రెప్పలా సాకుతున్న తల్లిదండ్రులు' ఈటీవీ భారత్ కథనానికి సెర్ప్ సీఈవో స్పందించారు. విజయవాడలో వర్ధన్ అనే దివ్యాంగుడికి మూడు నెలలుగా పింఛన్ ఆగిపోవడంతో.. కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రల సమస్యతో పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ క్రమంలో ఈటీవీ-భారత్‌లో కథనం ప్రచురిచతమైంది. దీనిపై స్పందించిన సెర్ప్ సీఈవో ఇంతియాజ్.. వర్ధన్‌కు పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల పింఛన్ రాకపోతే తానే స్వయంగా వచ్చి ఇస్తానని తెలిపారు.
ఇదీ చదవండి..