ETV Bharat / city

ఏపీ, తెలంగాణ మధ్య పూర్తయిన విద్యుత్ ఉద్యోగుల విభజన - andhrapradesh news

ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయింది. ఆయా సంస్థల నుంచి ఎంత మంది ఉద్యోగులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారో, అంతే సంఖ్యలో ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేలా తాజాగా జాబితా ఖరారు చేశారు.

Separation of completed Electricity employees between AP and Telangana
ఏపీ, తెలంగాణ మధ్య పూర్తయిన విద్యుత్ ఉద్యోగుల విభజన
author img

By

Published : Dec 20, 2020, 7:03 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయింది. శనివారం రాత్రికి జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లలో ఉద్యోగుల విభజన ముఖచిత్రం స్పష్టమైంది. ఆయా సంస్థల నుంచి ఎంత మంది ఉద్యోగులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారో, అంతే సంఖ్యలో ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేలా తాజాగా జాబితా రూపొందించారు. తెలంగాణ జెన్‌కో నుంచి 252 మంది; ట్రాన్స్‌కో నుంచి 134 మంది; ఎస్పీడీసీఎల్‌ నుంచి 81 మంది, ఎన్పీడీసీఎల్‌ నుంచి 65 మంది ఉద్యోగులు ఏపీకి వెళ్తున్నారు. అంతే సంఖ్యలో ఉద్యోగులు అక్కడ నుంచి రావాల్సి ఉండగా మెడికల్‌, స్పౌజ్‌ కేసుల కింద ఇప్పటికే 71 మంది తెలంగాణలో పనిచేస్తున్నారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్‌ ధర్మాధికారి ఏక సభ్య కమిషన్‌ ఇచ్చిన తుది నివేదికను అమలు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం ఏపీ జెన్‌కో నుంచి టీఎస్‌ జెన్‌కోకి రావలసిన జాబితాలో ఉన్న 252 మందిలో 26 మంది ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నారు. కొత్తగా 226 మంది రావలసి ఉంది. టీఎస్‌ ట్రాన్స్‌కోకు రావాల్సిన 134 మంది జాబితాలో 30 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంకా 104 మంది చేరాలి. అలాగే ఎస్పీడీసీఎల్‌కు వచ్చే 81 మందిలో 15 మంది ఇప్పటికే పనిచేస్తున్నారు. ఇంకా 66 మంది రావాలి. ఎన్పీడీసీఎల్‌కు 65 మంది రావాలి.

రేపు ఉత్తర్వులు: ప్రభాకరరావు

విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించిన తుది జాబితా సిద్ధమైందని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. ఈ మేరకు ఏపీ విద్యుత్‌ సంస్థలకు కూడా సమాచారం అందించామని చెప్పారు. ఉద్యోగులకు సోమవారం నియామక ఉత్తర్వులు అందజేస్తామని ప్రభాకరరావు తెలిపారు. ముందుగా 2014 జూన్‌ నాటి సీనియార్టీ జాబితాను అనుసరిస్తామని అన్నారు. ఏపీ నుంచి సర్వీసు రిజిస్టర్లు తదితరాలు అందిన తర్వాత ప్రమోషన్లను సమీక్షించాల్సి ఉంటుందని వివరించారు. తెలంగాణకు కొత్తగా కేటాయించిన ఉద్యోగులు హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధలోని చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు. వారు ఇక్కడ నుంచే డిసెంబరు జీతాలు పొందటానికి అర్హులని పేర్కొన్నారు.

ఉద్యోగుల్లో రివర్షన్‌ భయం

కొత్త వారు ఏపీ నుంచి వస్తే ఇక్కడున్న పోస్టులు సరిపోవని, లేదా ఇప్పటికే పదోన్నతులు పొందిన వారిని రివర్ట్‌ చేయాల్సి రావచ్చని ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సీనియార్టీ ప్రకారం ఉద్యోగులను భర్తీ చేస్తామని సంబంధిత యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. కొత్త పోస్టులు సిద్ధం చేసి తెలంగాణ ఉద్యోగులు నష్టపోకుండా చూడాలని తెలంగాణ విద్యుత్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు రత్నాకర్‌ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

మన ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.