ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ... ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సీనియర్ రెసిడెంట్ వైద్యులు విధులు బహిష్కరించారు. వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి రవిచంద్ర, డీఎమ్ఈ రాఘవేంద్రతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రెసిడెంట్ వైద్యుల స్టైఫండ్‌ను తాజాగా 80 వేల రూపాయలకు పెంచిందని... రాష్ట్రంలోనూ 45 వేల రూపాయలుగా ఉన్న ఉపకారవేతనాన్ని 80 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇది సాధ్యం కాదని ఉన్నతాధికారులు తేల్చి చెప్పటంతో... వైద్యులు వెనుదిరిగారు. జూడాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి:
Jagan Review: అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి: సీఎం