తాడిపత్రి నియోజకవర్గంలో 144 సెక్షన్‌తో పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున్న ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతిలు ఇవ్వబోమని డీఎస్పీ వి.ఎన్.కే చైతన్య తెలిపారు. తాడిపత్రిలో ఇటీవల జరగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా పట్టణంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్ రెడ్డి మౌన దీక్ష చేపట్టనున్నట్లుగా తమకు అందిన సమాచారం మేరకు పట్టణమంతా పెద్దఎత్తున బలగాలు మోహరించామని వెల్లడించారు. సాధారణ ప్రజలెవరూ భయబ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని తెలియజేయడం కోసం కవాతు చేపట్టమన్నారు.
ఒక్కడినైనా దీక్ష చేస్తా: జేసీ ప్రభాకర్ రెడ్డి
పోలీసులు ఎంతో నైపుణ్యం కూడిన శిక్షణ తీసుకుని ఉద్యోగాల్లోకి వస్తుంటారని..అటువంటి వారు రాజకీయ ఒత్తిళ్లకు గురి అవుతున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పేదలకు అండగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రక్షించాలని శాంతియుతంగా నిరసన తెలపాలని చూస్తే పోలీసులు ఎంతో ఖర్చు పెట్టి భారీ బలగాలతో కవాతు చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న గ్రామాల ప్రజలకు చరవాణీల ద్వారా పట్టణానికి రాకూడదని ఆంక్షలు విధించారన్నారు. అయినప్పటికీ సోమవారం తాను ఒక్కడినే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అట్రాసిటీ చట్టాన్ని కాపాడేందుకు తహసీల్దార్ కార్యాలయం ముందు మౌన దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి