అమరావతి పరిరక్షణ సమితి.. ఏపీ ఉద్యోగుల సంఘం అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో హైకోర్టులో పిటిషన్లు వేశారని సచివాలయ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. ఉద్యోగులను అనవసరంగా హైకోర్టు పిటిషన్లో చేర్చారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే ఉద్యోగులుగా హైకోర్టు పిటిషన్లో ఇంప్లీడ్ అయినట్లు స్పష్టం చేశారు.
రాజధాని తరలింపుపై బిల్లు పాస్ అయితే, కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. అది కూడా విదాయ సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా చూడాలనీ.. ఎవర్నీ తక్షణమే రావాలని ఇబ్బందులు పెట్టొద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాజధాని తరలింపు కోసం 5 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌కు వాస్తవాలతో కూడిన సమాధానం కోర్టుకు చెప్పినట్లు స్పష్టం చేశారు. ఉద్యోగులకు రాజకీయలకు సంబంధం లేదనీ.. తాము ఏ పార్టీకీ అనుకూలంగా లేమని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత