ETV Bharat / city

రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

కరోనా వ్యాప్తి, లౌక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు ఎట్టకేలకు నేడు తెరుచుకోనున్నాయి. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకానున్నారు. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లొచ్చు. 1 నుంచి 8 తరగతుల వారు మాత్రం ఇళ్ల వద్దే ఉండనున్నారు.

schools open
schools open
author img

By

Published : Sep 21, 2020, 7:44 AM IST

Updated : Sep 21, 2020, 9:29 AM IST

రాష్ట్రంలో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

లాక్‌డౌన్‌తో గత విద్యాసంవత్సరం పూర్తికాకుండానే పాఠశాలలు మూతపడ్డాయి. అనంతరం జూన్‌లో తిరిగి తెరవాల్సి ఉన్నా...కరోనా ఉద్ధృతి తగ్గని కారణంగా మూసే ఉంచారు. ఎట్టకేలకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలు నేటి నుంచి తెరుచుకుంటున్నాయి. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లొచ్చని... విద్యాశాఖ స్పష్టం చేసింది. 1 నుంచి 8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదని తెలిపింది. వీరికి తల్లిదండ్రుల ద్వారానే మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌, వీడియో పాఠాలే కొనసాగుతాయి. వర్క్‌షీట్లను అభ్యాస యాప్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని అభ్యాసనం కొనసాగించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేస్తారు.

విద్యార్థులు కూర్చునే సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు నోటుపుస్తకాలు, పెన్నులు, తాగునీటి సీసాలు పరస్పరం మార్చుకోకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని ఉపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు. పాఠశాలలకు, కళాశాలకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూడాలని సూచించారు. పంచాయతీరాజ్‌, పురపాలక విభాగాలను సంప్రదించి ప్రధానోపాధ్యాయులు పాఠశాల పరిసరాలను శానిటైజ్‌ చేయించాలని విద్యాశాఖ నిర్దేశించింది.

తొలిరోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉండగా.. 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ బోధన, టెలి కౌన్సెలింగ్‌, విద్యా వారధి వంటి కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. రెసిడెన్షియల్‌, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు వాట్సప్‌ గ్రూపు ద్వారా ఆన్‌లైన్‌లో మార్గనిర్దేశం చేస్తారు. కావాలనుకుంటే వీరు సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయుల సూచనలు, మార్గదర్శకాలు తీసుకోవచ్చు. విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాలు అక్టోబరు 5వరకు కొనసాగుతాయి.

నేడు ఉపాధ్యాయులందరూ హాజరు కావాల్సిందే..

ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరూ సోమవారం విధులకు హాజరు కావాలని పాఠశాల విద్య సంచాలకులు చిన వీరభద్రుడు తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన వారు బడులకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై సందిగ్ధత నెలకొనడంతో ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని, మంగళవారం నుంచి 50శాతం చొప్పున వెళ్లాలని సూచించారు. ఏకోపాధ్యాయులు రోజూ వెళ్లాలని పేర్కొన్నారు. మొదటిరోజు హాజరైన ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: కరోనాతో పెరిగిన గుడ్డు వినియోగం

Last Updated : Sep 21, 2020, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.